Telugu Global
NEWS

ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ లో భారత్ బోణీ

విండీస్ తో సిరీస్ లో 1-0 తో ఆధిక్యం అజింక్యా రహానే సెంచరీ షో 2019 ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా…కరీబియన్ గడ్డపై ప్రారంభమైన రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ఆంటీగాలోని నార్త్ సౌండ్.. సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి టెస్టులో విండీస్ ను భారత్ 318 పరుగుల భారీతేడాతో చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది.   ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ, జస్ ప్రీత్ […]

ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ లో భారత్ బోణీ
X
  • విండీస్ తో సిరీస్ లో 1-0 తో ఆధిక్యం
  • అజింక్యా రహానే సెంచరీ షో

2019 ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా…కరీబియన్ గడ్డపై ప్రారంభమైన రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ఆంటీగాలోని నార్త్ సౌండ్.. సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి టెస్టులో విండీస్ ను భారత్ 318 పరుగుల భారీతేడాతో చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా చెలరేగిపోడంతో పాటు… వైస్ కెప్టెన్ అజింక్యా రహానే రెండు ఇన్నింగ్స్ లోనూ నిలకడగా రాణించడంతో భారత్ విజయం నల్లేరు మీద బండి నడకలా సాగింది.

బుమ్రా బూమ్ బూమ్..

419 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్ ను భారత పేసర్ బుమ్రా 100 పరుగుల స్కోరుకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు.

బుమ్రా స్వింగ్ ధాటికి విండీస్ టాపార్డర్ కకావికలమయ్యింది. కేవలం 26.5 ఓవర్లలోనే విండీస్ టీమ్ చేతులెత్తేసింది.

బుమ్రా 8 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ చరిత్రలో ఓ భారత ఫాస్ట్ బౌలర్ సాధించిన అత్యుత్తమ రికార్డు ఇదే కావడం విశేషం.

బుమ్రా టెస్ట్ రికార్డు….

టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత తొలిబౌలర్ గా బుమ్రా రికార్డుల్లో చేరాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడిన 55 ఏళ్ల బుమ్రా 55 వికెట్లు సాధించాడు.

మరోవైపు… వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తొలి ఇన్నింగ్స్ లో 81, రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులు సాధించడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఈ భారీవిజయంతో భారత్ కు 60 పాయింట్లు దక్కాయి.

సిరీస్ లోని రెండోటెస్ట్ మ్యాచ్ జమైకాలోని సబైనా పార్క్ వేదికగా ఆగస్టు 30న ప్రారంభమవుతుంది.

First Published:  27 Aug 2019 4:01 AM IST
Next Story