Telugu Global
NEWS

శ్రీవారి హుండీ.... టీటీడీ మాస్టర్ ప్లాన్ సక్సెస్

కలియుగ ప్రత్యక్ష దైవం.. కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి దేశ విదేశ భక్తులు ఎన్నో కానుకలు, నగదును హుండీలో వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే రోజురోజుకు హుండీ ఆదాయం పెరగడం.. దాన్ని లెక్కించడం టీటీడీకి పెనుభారమవుతోంది. మొదట్లో టీటీడీ ఉద్యోగులు లెక్కించేవారు. కానీ ఇది భారం కావడంతో వారంతా వైదొలిగారు. శ్రీవారి సేవకులతో లెక్కించారు. సేవకులు అంతా వృద్దులు, మధ్యవయస్కులు కావడంతో చాలా సమయం పడుతూ అదో ప్రహసనంగా మారింది. కాగా ఇప్పుడు […]

శ్రీవారి హుండీ.... టీటీడీ మాస్టర్ ప్లాన్ సక్సెస్
X

కలియుగ ప్రత్యక్ష దైవం.. కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి దేశ విదేశ భక్తులు ఎన్నో కానుకలు, నగదును హుండీలో వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే రోజురోజుకు హుండీ ఆదాయం పెరగడం.. దాన్ని లెక్కించడం టీటీడీకి పెనుభారమవుతోంది.

మొదట్లో టీటీడీ ఉద్యోగులు లెక్కించేవారు. కానీ ఇది భారం కావడంతో వారంతా వైదొలిగారు. శ్రీవారి సేవకులతో లెక్కించారు. సేవకులు అంతా వృద్దులు, మధ్యవయస్కులు కావడంతో చాలా సమయం పడుతూ అదో ప్రహసనంగా మారింది.

కాగా ఇప్పుడు దీనికి టీటీడీ అధికారులు ఓ అద్భుతమైన ప్లాన్ వేశారు. అది సక్సెస్ కావడంతో ఇప్పుడు టీటీడీ సంతోషంగా ఉంది. దీన్నే కొనసాగించాలని డిసైడ్ అయ్యింది.

శ్రీవారికి వచ్చే కోట్ల విలువైన నగదు, కానుకలను లెక్కించడానికి టీటీడీ నడుపుతున్న శ్రీవేంకటేశ్వర కాలేజీ ‘ఎస్వీ ఆర్ట్స్’ విద్యార్థులను పురమాయించింది. విద్యార్థులు ఈ లెక్కింపునకు ఓకే చెప్పడంతో తాజాగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి లెక్కింపును ప్రారంభించారు. మామూలుగా ఈ లెక్కింపులు పూర్తి చేయడానికి రాత్రి సమయం వరకూ పట్టేది… కానీ ఇప్పుడు సాయంత్రం వరకే విద్యార్థులు లెక్కించేశారు. దీంతో ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇక నుంచి శ్రీవారి హుండీ కానుకలను ఎస్వీ కాలేజీ విద్యార్థులతోనే లెక్కించాలని డిసైడ్ అయ్యింది.

First Published:  27 Aug 2019 12:48 AM GMT
Next Story