Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ లో చిరంజీవికి గట్టి పోటీ ఇదే..

1992లో చిరంజీవి ‘ఆజ్ కా గుండారాజ్’తో హిందీలో సినిమా చేసి బాలీవుడ్ లో ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయ్యి చిరంజీవికి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా హిందీ వైపు చూడని చిరంజీవి చాలా రోజుల తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడి కథ ‘సైరా’తో బాలీవుడ్ లోకి మళ్లీ అడుగుపెడుతున్నాడు. అక్టోబర్ 2న సైరాను హిందీలో రిలీజ్ చేస్తున్నారు. అమిత్ తడాని, ఫర్హాన్ అక్తర్ లు సంయుక్తంగా సైరా హక్కులు కొని తమ ‘ఎక్సైల్ […]

బాలీవుడ్ లో చిరంజీవికి గట్టి పోటీ ఇదే..
X

1992లో చిరంజీవి ‘ఆజ్ కా గుండారాజ్’తో హిందీలో సినిమా చేసి బాలీవుడ్ లో ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయ్యి చిరంజీవికి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా హిందీ వైపు చూడని చిరంజీవి చాలా రోజుల తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడి కథ ‘సైరా’తో బాలీవుడ్ లోకి మళ్లీ అడుగుపెడుతున్నాడు.

అక్టోబర్ 2న సైరాను హిందీలో రిలీజ్ చేస్తున్నారు. అమిత్ తడాని, ఫర్హాన్ అక్తర్ లు సంయుక్తంగా సైరా హక్కులు కొని తమ ‘ఎక్సైల్ ఎంటర్ టైన్ మెంట్ ’ పతాకంపై రిలీజ్ చేస్తున్నారు. వీళ్లిద్దరూ గతంలో రిలీజ్ చేసిన కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ గ్రాండ్ హిట్ అయ్యింది. ఇప్పుడు సైరాను భారీగా రిలీజ్ చేస్తున్నారు.

అయితే చిరంజీవికి అంత ఈజీగా పోటీలేదు. అదే రోజు బాలీవుడ్ అగ్రహీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన వార్ సినిమా రిలీజ్ అవుతోంది. మరి డైరెక్ట్ హిందీ సినిమాను తట్టుకొని చిరంజీవి సైరా ఏమేరకు సత్తా చాటుతుందనే భయం సైరా టీమ్ ను వెంటాడుతోంది. వేరే రోజు రిలీజ్ చేద్దామన్నా…. తెలుగు, తమిళం, మలయాళంలో రిలీజ్ చేసి హిందీలో ఆపితే బాగోదు. అందుకే సైరాకు భారీగా ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారట..

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కు అమితాబ్ బచ్చన్ ను రప్పించడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోందట.. ఆయన వస్తే సినిమాకు భారీ హైప్ వస్తుందని…. హిందీ సినిమాలను తట్టుకొని కంటెంట్ తో నిలబడుతుందని ఆశిస్తున్నారు. దేశభక్తి దేశంలో పెచ్చరిల్లుతున్న వేళ…. ‘సైరా’కు అవకాశాలు ఉన్నాయంటున్నారు.

First Published:  27 Aug 2019 9:57 AM IST
Next Story