పోలవరంపై... ప్రభుత్వం కీలక నిర్ణయం
పోలవరం ఏపీ కి గుండె కాయ లాంటి ప్రాజెక్టు. ఏపీని తాగు, సాగునీటితో సస్యశ్యామలం చేయగల ఈ ప్రాజెక్టు విషయంలో అధికార వైసీపీ సంచలన నిర్ణయాలతో హడలెత్తిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరంలో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చి… ఇటీవలే పాత టెండర్లను రద్దు చేస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై పెద్ద దుమారం రేగింది. పోలవరం కాంట్రాక్ట్ సంస్థలు, టీడీపీ పోరుబాట పట్టాయి. కానీ పోలవరం విషయంలో మాత్రం జగన్ సర్కారు ముందుకే […]

పోలవరం ఏపీ కి గుండె కాయ లాంటి ప్రాజెక్టు. ఏపీని తాగు, సాగునీటితో సస్యశ్యామలం చేయగల ఈ ప్రాజెక్టు విషయంలో అధికార వైసీపీ సంచలన నిర్ణయాలతో హడలెత్తిస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరంలో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చి… ఇటీవలే పాత టెండర్లను రద్దు చేస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అయితే దీనిపై పెద్ద దుమారం రేగింది. పోలవరం కాంట్రాక్ట్ సంస్థలు, టీడీపీ పోరుబాట పట్టాయి. కానీ పోలవరం విషయంలో మాత్రం జగన్ సర్కారు ముందుకే వెళుతోంది.
తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిలు అమిత్ షాతో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సమస్యల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు.
పోలవరం టెండర్లను పునరుద్దరించే ప్రసక్తే లేదని సీఎం జగన్ నిర్ణయించారని.. రీటెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. రీటెండరింగ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
త్వరలోనే పోలవరానికి కొత్త టెండర్లను పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిని ఏర్పాటు చేసుకొని పోలవరం ను పూర్తి చేస్తామని పెద్ది రెడ్డి ప్రకటించారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను పోలవరం పర్యటనకు ఆహ్వానించామన్నారు. పోలవరాన్ని కేంద్రానికి అప్పగించే ఆలోచన తమకు లేదన్నారు.