Telugu Global
Cinema & Entertainment

తారక్ ఫస్ట్ లుక్ అప్పుడే....

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం అందరి నోట్లో నానుతున్న పెద్ద ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఈ సినిమా లో నటించనుండటం విశేషం. అయితే ఈ సినిమా ని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడు పూర్తి అవుతుందని అందరూ అనుకుంటున్నా…. ఆ విషయాలేమి బయటకు పొక్కకుండా చాలా పకడ్బందీ గా షూటింగ్ కొనసాగిస్తున్నాడు రాజమౌళి. ఇకపోతే అల్లూరి సీతారామరాజు లాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కొమరం భీం […]

తారక్ ఫస్ట్ లుక్ అప్పుడే....
X

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం అందరి నోట్లో నానుతున్న పెద్ద ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఈ సినిమా లో నటించనుండటం విశేషం. అయితే ఈ సినిమా ని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.

ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడు పూర్తి అవుతుందని అందరూ అనుకుంటున్నా…. ఆ విషయాలేమి బయటకు పొక్కకుండా చాలా పకడ్బందీ గా షూటింగ్ కొనసాగిస్తున్నాడు రాజమౌళి.

ఇకపోతే అల్లూరి సీతారామరాజు లాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. చరిత్రలో ఈ రెండు పాత్రలు కలుసుకుంటే ఎలా ఉంటుంది? అనే కల్పితమైన కథ తో ఈ సినిమా ని తెర మీదకి తీసుకొని వస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికీ ఈ సినిమా టైటిల్ తప్ప హీరోల లుక్ ఎలా ఉంటుంది అనే విషయం మీద ఒక క్లారిటీ రాలేదు. అయితే సినిమా యూనిట్ కావాలనే లుక్స్ విడుదల విషయం లో ఆలస్యం చేస్తుందని తెలుస్తుంది. కాకపోతే కొమురం భీమ్ పుట్టినరోజు అక్టోబర్ 22న ఎన్టీఆర్ లుక్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా గురించి మిగిలిన వివరాలు త్వరలో తెలుస్తాయి.

First Published:  27 Aug 2019 5:03 AM IST
Next Story