Telugu Global
NEWS

యరపతినేనిపై సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకోండి " హైకోర్టు కీలక సూచన

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మైనింగ్ డాన్ యరపతినేని శ్రీనివాస్‌ కేసులో హైకోర్టు కీలక సూచనలు చేసింది. యరపతినేని అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్టు సీఐడీ నివేదికను బట్టి స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. యరపతినేనికి చెందిన బ్యాంకుల లావాదేవీల్లోనూ అక్రమాలు జరిగినట్టు అనుమానాలు ఉన్నాయంది. సీఐడీ విచారణలో యరపతినేని అక్రమాలపై సాక్ష్యులు పలు కీలక విషయాలు వెల్లడించినట్టు నివేదికలో ఉంది. ఈ అక్రమ మైనింగ్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు గాను కేసును సీబీఐకి అప్పగించే విషయంలో రాష్ట్ర […]

యరపతినేనిపై సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకోండి  హైకోర్టు కీలక సూచన
X

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మైనింగ్ డాన్ యరపతినేని శ్రీనివాస్‌ కేసులో హైకోర్టు కీలక సూచనలు చేసింది. యరపతినేని అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్టు సీఐడీ నివేదికను బట్టి స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. యరపతినేనికి చెందిన బ్యాంకుల లావాదేవీల్లోనూ అక్రమాలు జరిగినట్టు అనుమానాలు ఉన్నాయంది.

సీఐడీ విచారణలో యరపతినేని అక్రమాలపై సాక్ష్యులు పలు కీలక విషయాలు వెల్లడించినట్టు నివేదికలో ఉంది. ఈ అక్రమ మైనింగ్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు గాను కేసును సీబీఐకి అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సీబీఐ విచారణ జరిపించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలంది.

పెద్దెత్తున అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా ఉంది.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఉండడంతో సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే యరపతినేని పైకోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.

First Published:  26 Aug 2019 9:26 AM IST
Next Story