కాంగ్రెస్ లో నాయకత్వ పోటీ....
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు నాయకత్వ పోటీ నెలకొంది. తెలంగాణ పీసీసీ పదవిని భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ను చేయనున్నారనే సమాచారం లీక్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి అలెర్ట్ అయ్యారు. తన నాయకత్వ పటిమను చూపించేందుకు రెడీ అయ్యారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉన్న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కోమటిరెడ్డి తెరపైకి తెచ్చాడు. ప్రభుత్వం ఈ […]
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు నాయకత్వ పోటీ నెలకొంది. తెలంగాణ పీసీసీ పదవిని భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ను చేయనున్నారనే సమాచారం లీక్ అయ్యింది.
దీంతో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి అలెర్ట్ అయ్యారు. తన నాయకత్వ పటిమను చూపించేందుకు రెడీ అయ్యారు.
తాజాగా నల్గొండ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉన్న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కోమటిరెడ్డి తెరపైకి తెచ్చాడు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే డిమాండ్ తో ఈనెల 26-29 వరకు రైతులతో కలిసి హైదరాబాద్ కు పాదయాత్రకు రెడీ అయ్యారు.
అయితే కోమటిరెడ్డి పాదయాత్రకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. దీంతో కోమటిరెడ్డి హైకోర్టును ఆశ్రయించి ఎలాగైనా పాదయాత్రను చేయాలని డిసైడ్ అయ్యారు.
కాంగ్రెస్ లో మంత్రిగా 10 ఏళ్లు అధికారంలో ఉండగా గుర్తుకురాని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు…. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవి భర్తీ చేయడానికి రెడీ అయిన వేళ కోమటిరెడ్డికి గుర్తుకు వచ్చిందా అంటూ మరో వర్గం చర్చించుకుంటోంది.