Telugu Global
Cinema & Entertainment

ఆ మేకోవర్ అసలైంది కాదంట

దాదాపు 24 గంటలుగా రవితేజ కొత్త స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ బుర్ర మీసాలతో కనిపించే ఈ హీరో తొలిసారిగా మీసం తీసేశాడు. ఈ దెబ్బకు చాలామంది రవితేజను గుర్తుపట్టలేకపోయారు కూడా. ఓ వ్యక్తితో సెల్ఫీ దిగుతూ రవితేజ కనిపిస్తున్న ఫొటో అలా చాలా పాపులర్ అయిపోయింది. డిస్కో రాజా సినిమాలో రవితేజ మేకోవర్ ఇదేనంటూ ఆ ఫొటోను వైరల్ చేయడం స్టార్ట్ చేశాడు చాలామంది. దీనిపై దర్శకుడు వీఐ ఆనంద్ […]

ఆ మేకోవర్ అసలైంది కాదంట
X

దాదాపు 24 గంటలుగా రవితేజ కొత్త స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ బుర్ర మీసాలతో కనిపించే ఈ హీరో తొలిసారిగా మీసం తీసేశాడు. ఈ దెబ్బకు చాలామంది రవితేజను గుర్తుపట్టలేకపోయారు కూడా. ఓ వ్యక్తితో సెల్ఫీ దిగుతూ రవితేజ కనిపిస్తున్న ఫొటో అలా చాలా పాపులర్ అయిపోయింది. డిస్కో రాజా సినిమాలో రవితేజ మేకోవర్ ఇదేనంటూ ఆ ఫొటోను వైరల్ చేయడం స్టార్ట్ చేశాడు చాలామంది. దీనిపై దర్శకుడు వీఐ ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు.

మీసాల్లేకుండా రవితేజ ఉన్న ఫొటోకు, తమ సినిమాకు సంబంధం లేదని ప్రకటించాడు. అసలది రవితేజ మేకోవర్ కాదని, త్వరలోనే రవితేజ కొత్త గెటప్ తో ఫొటో రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది. వీఐ ఆనంద్ చెప్పినట్టు, రవితేజకు మరో మేకోవర్ ఉండొచ్చు. అధికారికంగా అదే స్టిల్ విడుదలయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఫొటోకు, సినిమాకు సంబంధం లేదని చెప్పడంతో దర్శకుడికి సోషల్ మీడియాలో అక్షింతలు పడుతున్నాయి.

డిస్కోరాజా సినిమాలో ఇలా మీసాల్లేకుండా ఉన్న గెటప్ కూడా ఉంది. కానీ అలాంటిదేం లేదని దర్శకుడు చెప్పడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురవుతున్నారు. బాలయ్య విషయంలో కూడా ఇదే జరిగింది. వెరైటీ గడ్డంతో బాలయ్య ఉన్న ఫొటో ఒకటి నెట్ లో ప్రత్యక్షమైంది. మొదట బుకాయించిన యూనిట్, ఇక చేసేదేం లేక అదే ఫొటోకు సంబంధించి హెచ్ డీ స్టిల్ ను రిలీజ్ చేసింది. అలా దాన్నే ఫస్ట్ లుక్ గా ప్రకటించేసింది కూడా. అదే పని వీఐ ఆనంద్ చేసి ఉంటే బాగుండేది. ఖండించడంతోనే సమస్య వచ్చింది.

First Published:  26 Aug 2019 3:01 AM IST
Next Story