జగన్ ను వీడను.... వైసీపీలోనే ఉంటా
ఏపీ సీఎం జగన్‌కు తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని నందికొట్కూరు వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి అన్నారు. జగన్ ను వీడనని… తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. నందికొట్కూరులో టీడీపీ కనుసన్నుల్లోనే రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారాయన. వైసీపీ కార్యకర్తలను తొక్కేసి టీడీపీ వాళ్లు పనులు చేయించుకుంటున్నారని వాపోయారు. తనకు ఎమ్మెల్యేలతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. సీఎం తనను, ఎమ్మెల్యేను పిలిపించి మాట్లాడారని చెప్పారు. త్వరలోనే నియోజకవర్గంలో భారీ సమావేశం ఏర్పాటు […]
ఏపీ సీఎం జగన్‌కు తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని నందికొట్కూరు వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి అన్నారు.
జగన్ ను వీడనని… తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. నందికొట్కూరులో టీడీపీ కనుసన్నుల్లోనే రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారాయన.
వైసీపీ కార్యకర్తలను తొక్కేసి టీడీపీ వాళ్లు పనులు చేయించుకుంటున్నారని వాపోయారు. తనకు ఎమ్మెల్యేలతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు.
సీఎం తనను, ఎమ్మెల్యేను పిలిపించి మాట్లాడారని చెప్పారు. త్వరలోనే నియోజకవర్గంలో భారీ సమావేశం ఏర్పాటు చేస్తానని బైరెడ్డి తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజక వర్గంలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నంది కొట్కూరు నియోజక వర్గంలో బైరెడ్డి వర్గానికి ఇతరులకు పడడం లేదు.
ఈ లోపు గౌరు చరిత దంపతులు తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. వారి వెంట ఉన్న కేడర్‌కే ఇప్పటికీ పనులు జరుగుతున్నాయని బైరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఇప్పటికైనా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని అంటున్నారు.