టీటీడీలో ధర్మపోరాట దీక్ష దుమారం...
తిరుమల తిరుపతి దేవాస్థానం నిధుల గోల్‌మాల్ అంశం దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని టీటీడీ ఆలయ నిధులను దారి మళ్లించిన వ్యవహారంలో టీటీడీ విజిలెన్స్ ఏపీ భవన్‌లో తనిఖీలు నిర్వహించింది. దాంతో ఏపీ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాశ్ … టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు హయాంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు టీటీడీ ఆలయానికి చెందిన నాలుగు కోట్ల రూపాయలను దారి మళ్లించినట్టు చెబుతున్నారు. ముందు టీటీడీ […]
తిరుమల తిరుపతి దేవాస్థానం నిధుల గోల్‌మాల్ అంశం దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని టీటీడీ ఆలయ నిధులను దారి మళ్లించిన వ్యవహారంలో టీటీడీ విజిలెన్స్ ఏపీ భవన్‌లో తనిఖీలు నిర్వహించింది. దాంతో ఏపీ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాశ్ … టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
చంద్రబాబు హయాంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు టీటీడీ ఆలయానికి చెందిన నాలుగు కోట్ల రూపాయలను దారి మళ్లించినట్టు చెబుతున్నారు. ముందు టీటీడీ నిధులు ఖర్చు పెట్టండి… ఆ తర్వాత సర్దుబాటు చేద్దామంటూ చంద్రబాబు ఇచ్చిన సూచన మేరకే టీటీడీ నిధులను ధర్మపోరాట దీక్షకు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు.
టీటీడీ నిధులతోనే టీడీపీ నేతలకు హోటల్స్‌లో గదులు, భోజనం, వాహనాలు సమకూర్చినట్టు తేలింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై తిరుపతికి చెందిన ఒక కాంగ్రెస్ నేత చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు.
కానీ గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఢిల్లీ టీటీడీ ఆలయంలో అక్రమాలకు సంబంధించి ఒక అజ్ఞాత భక్తుడు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయగా… టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. చైర్మన్ ఆదేశాల మేరకు టీటీడీ విజిలెన్స్ సిబ్భంది ఢిల్లీ వెళ్లి తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నిధుల గోల్‌మాల్‌పై గతంలోనే ఫిర్యాదులు వచ్చినా విచారణ ముందుకెళ్లకుండా ఏపీ రెసిడెంట్ కమీషనర్, ఢిల్లీ టీటీడీ స్థానిక సలహా బోర్డు చైర్మన్ ప్రవీణ్ ప్రకాశ్ అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే హఠాత్తుగా ఢిల్లీ వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయడంతో షాక్ అయిన ప్రవీణ్ ప్రకాశ్… అలా చేయడంపై మండిపడ్డాడు. దాంతో అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా ప్రవీణ్ ప్రకాశ్‌ను వైవీ సుబ్బారెడ్డి ఆదేశించినట్టు చెబుతున్నారు.