Telugu Global
NEWS

మా ఆవిడ హీరోయిన్ అయితే బాగుండేది

“బాలకృష్ణ అంకుల్ కూతుర్లు ఇద్దరూ బాగుంటారు. ఇంకా చెప్పాలంటే హీరోయిన్స్ అయ్యే లక్షణాలు ఇద్దరిలో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎందుకో ముందు నుంచి ఆ కుటుంబంలో మహిళలు కళారంగంవైపు రాలేదు. నిజానికి నా భార్య తేజశ్విని హీరోయిన్ అయితే చూడాలనుకున్నాను. ఇప్పటికీ ఆమెకు ఆ స్వేచ్ఛ ఇస్తాను.” ఈ మాటలు అంటోంది ఎవరో కాదు, స్వయానా బాలకృష్ణ అల్లుడు, తేజశ్విని భర్త భరత్. రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం తరఫున పోటీచేసి మరీ ఓడిపోయిన భరత్.. […]

మా ఆవిడ హీరోయిన్ అయితే బాగుండేది
X

“బాలకృష్ణ అంకుల్ కూతుర్లు ఇద్దరూ బాగుంటారు. ఇంకా చెప్పాలంటే హీరోయిన్స్ అయ్యే లక్షణాలు ఇద్దరిలో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎందుకో ముందు నుంచి ఆ కుటుంబంలో మహిళలు కళారంగంవైపు రాలేదు. నిజానికి నా భార్య తేజశ్విని హీరోయిన్ అయితే చూడాలనుకున్నాను. ఇప్పటికీ ఆమెకు ఆ స్వేచ్ఛ ఇస్తాను.”

ఈ మాటలు అంటోంది ఎవరో కాదు, స్వయానా బాలకృష్ణ అల్లుడు, తేజశ్విని భర్త భరత్. రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం తరఫున పోటీచేసి మరీ ఓడిపోయిన భరత్.. తన వ్యక్తిగత జీవితంలో పాటు బాలయ్య ఫ్యామిలీకి సంబంధించి చాలా వివరాలు బయటపెట్టాడు. ఇందులో భాగంగా తన భార్యకు హీరోయిన్ లక్షణాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

“బ్రాహ్మణి ఎప్పుడూ ఆ షేడ్స్ లో కనిపించరు. ఆమెకు నిత్యం బిజినెస్ వ్యవహారాలే. కానీ నా భార్య తేజస్విని అలా కాదు. ఆమె చాలా యాక్టివ్. కళాహృదయం కూడా ఉంది. అప్పుడప్పుడు భలేగా నటిస్తుంది. నువ్వు హీరోయిన్ అయితే బాగుంటుందని తనకు చెప్పాను కూడా. డైరక్ట్ గా హీరోయిన్ అవ్వకపోయినా.. ఆమె ఇండస్ట్రీలోకి మాత్రం వస్తుంది. బహూశా ప్రొడక్షన్ ఫీల్డ్ లోకి వస్తుందేమో. నేనైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను.”

మరోవైపు మామ బాలయ్య గురించి కూడా మాట్లాడాడు భరత్. తన మామలో అసలైన కోణాన్ని ఇప్పటివరకు ఏ దర్శకుడు బయటపెట్టలేకపోయారనేది భరత్ వాదన. తెరవెనక బాలయ్యలో చాలా ఫన్ అంటుందని, ఇంకెంతో ఆధ్యాత్మికత కూడా ఉందని.. ఆ రెండు కోణాల్ని ఆవిష్కరించే దర్శకుడు ఇంతవరకు రాలేదంటారాయన.

First Published:  25 Aug 2019 1:10 PM IST
Next Story