కశ్మీర్ వాయిస్ వినిపించేందుకు రాహుల్ , ప్రతిపక్షాలు రెడీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెడీ అవుతున్నారు. కశ్మీర్ విషయంలో కేంద్రం చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయా? విఫలమయ్యాయా? నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. ఇందుకోసం దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఏకంగా కశ్మీర్ కు పయనమవుతున్నాడు. ఇదివరకే గులాం నబీ ఆజాద్ సహా సీపీఐ, సీపీఎం నేతలు కశ్మీర్ వెళితే పోలీసులు వెనక్కి పంపారు. దీంతో రాహుల్ గాంధీనే రంగంలోకి దిగారు. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సీపీఐ, సీపీఎం దిగ్గజ నేతలతో కలిసి గులాం నబీ ఆజాద్, […]
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెడీ అవుతున్నారు. కశ్మీర్ విషయంలో కేంద్రం చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయా? విఫలమయ్యాయా? నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. ఇందుకోసం దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఏకంగా కశ్మీర్ కు పయనమవుతున్నాడు.
ఇదివరకే గులాం నబీ ఆజాద్ సహా సీపీఐ, సీపీఎం నేతలు కశ్మీర్ వెళితే పోలీసులు వెనక్కి పంపారు. దీంతో రాహుల్ గాంధీనే రంగంలోకి దిగారు. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సీపీఐ, సీపీఎం దిగ్గజ నేతలతో కలిసి గులాం నబీ ఆజాద్, రాహుల్ లు కశ్మీర్ బాట పట్టారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో కర్ఫ్యూ విధించి అక్కడి ప్రజల వాయిస్ బయటకు రాకుండా… సైన్యం చేతుల్లోకి తీసుకోవడంతో ఇప్పుడు కశ్మీర్ లో ఎలాంటి పరిస్థితులున్నాయనే విషయాలపై అక్కడి ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకోవడానికి కాంగ్రెస్ నేత రాహుల్ రెడీ అయ్యారు. శుక్రవారం ఈ మేరకు చర్చించి నేతలు నిర్ణయించారు. మోడీ సర్కార్ అనుమతిస్తే కశ్మీర్ లోయ సహా శ్రీనగర్ లో కూడా పర్యటించాలని వీరు యోచిస్తున్నారు.
కశ్మీర్ ప్రజల వాయిస్ ను ప్రపంచానికి వినిపించి మోడీ సర్కారును ఎండగట్టాలని రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్, మిగతా పార్టీల నేతలు రెడీ అయ్యారు. మరి ఈ ఎత్తుగడను మోడీ సర్కారు ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.