Telugu Global
NEWS

మద్య నిషేదానికి శ్రీకారం... ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నారు. తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేదం తీసుకు వస్తామన్న జగన్… ఇప్పుడు అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 3,500 మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం […]

మద్య నిషేదానికి శ్రీకారం... ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నారు. తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేదం తీసుకు వస్తామన్న జగన్… ఇప్పుడు అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు.

అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో 3,500 మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బేవరేజెస్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల నిర్వహణ జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 800 షాపులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బెల్టు షాపుల నిర్మూలనతో పాటు దశల వారీగా మద్య పాన నిషేదం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మద్యం దుకాణాలలో సూపర్ వైజర్లు, ఇతర సిబ్బందిని నియమించేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కూడా ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇక ప్రార్ధనా మందిరాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కఠిన చర్యలను తీసుకోనున్నారు. ముందుగా తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మధ్యలో ఎలాంటి మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వరాదని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

First Published:  23 Aug 2019 12:35 AM IST
Next Story