Telugu Global
NEWS

విరాట్ కొహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు

విండీస్ పై సెంచరీబాదితే పాంటింగ్ సరసన కొహ్లీ ఆధునిక క్రికెట్లో రికార్డుల మొనగాడు, శతకసమ్రాట్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు విరాట్ కొహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. విండీస్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరి రెండు వన్డేలలోనూ శతకాలు బాదిన కొహ్లీ… ఈ నెల 22న కరీబియన్ గడ్డపై ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. పాంటింగ్ రికార్డుకు చేరువగా కొహ్లీ… కెప్టెన్ […]

విరాట్ కొహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు
X
  • విండీస్ పై సెంచరీబాదితే పాంటింగ్ సరసన కొహ్లీ

ఆధునిక క్రికెట్లో రికార్డుల మొనగాడు, శతకసమ్రాట్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు విరాట్ కొహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది.

విండీస్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరి రెండు వన్డేలలోనూ శతకాలు బాదిన కొహ్లీ… ఈ నెల 22న కరీబియన్ గడ్డపై ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

పాంటింగ్ రికార్డుకు చేరువగా కొహ్లీ…

కెప్టెన్ గా 19 శతకాలు సాధించిన రికార్డు ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉంది. అయితే…కెప్టెన్ గా ఇప్పటికే 18 సెంచరీలు సాధించిన విరాట్ కొహ్లీ.. విండీస్ తో టెస్ట్ సిరీస్ లో మరో సెంచరీ సాధించగలిగితే…పాంటింగ్ 19 సెంచరీల రికార్డును సమం చేయగలుగుతాడు.

అత్యధిక సెంచరీల కెప్టెన్ గ్రీమ్ స్మిత్..

క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ ప్రపంచ రికార్డు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రీమ్ స్మిత్ పేరుతో ఉంది. తన కెరియర్ లో స్మిత్ ఆడిన 109 టెస్టుల్లో 25 సెంచరీలు సాధించాడు. ఇందులో 17 శతకాలు విదేశీ సిరీస్ ల్లో సాధించినవే కావడం మరో విశేషం.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 2019 వన్డే ప్రపంచకప్ లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన కొహ్లీ కనీసం ఒక్క శతకమైనా బాదలేకపోయాడు.

విండీస్ తో ముగిసిన వన్డే సిరీస్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో తిరిగి ఫామ్ ను అందిపుచ్చుకోగలిగాడు.
ఆంటీగా వేదికగా ఈ నెల 22న జరిగే తొలిటెస్ట్ లో కొహ్లీ స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే మూడంకెల స్కోరు సాధించడం ఏమంత కష్టం కాబోదు.

First Published:  23 Aug 2019 5:47 AM IST
Next Story