Telugu Global
NEWS

ఒలింపిక్స్ స్వర్ణానికి భజరంగ్ పూనియా గురి

రాజీవ్ ఖేల్ రత్నగా భజరంగ్ పూనియా ఖేల్ రత్న అందుకోనున్న నాలుగో భారత వస్తాదు దేశఅత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అందుకోనున్న యువవస్తాదు భజరంగ్ పూనియా…వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే 2020 ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని ప్రకటించాడు. ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ కుస్తీలో బంగారు పతకాలు, ప్రపంచ కుస్తీలో మరో రెండు పతకాలు సాధించిన 25 ఏళ్ల భజరంగ్ పూనియా పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న […]

ఒలింపిక్స్ స్వర్ణానికి భజరంగ్ పూనియా గురి
X
  • రాజీవ్ ఖేల్ రత్నగా భజరంగ్ పూనియా
  • ఖేల్ రత్న అందుకోనున్న నాలుగో భారత వస్తాదు

దేశఅత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అందుకోనున్న యువవస్తాదు భజరంగ్ పూనియా…వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే 2020 ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని ప్రకటించాడు.

ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ కుస్తీలో బంగారు పతకాలు, ప్రపంచ కుస్తీలో మరో రెండు పతకాలు సాధించిన 25 ఏళ్ల భజరంగ్ పూనియా పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి భారత కుస్తీ సమాఖ్య నామినేట్ చేసింది.

ఈ నెల 29న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పూనియా ఖేల్ రత్న అందుకోనున్నాడు.

భారత కుస్తీ చరిత్రలో ఇప్పటికే సుశీల్ కుమార్,యోగేశ్వర్ దత్,సాక్షీ మాలిక్ మాత్రమే.. రాజీవ్ ఖేల్ రత్న అందుకొన్న వస్తాదులుగా నిలిచారు. భజరంగ్ పూనియా ఈ ఘనత సాధించిన భారత నాలుగో రెజ్లర్ కానున్నాడు.

అతిచిన్న వయసులోనే తన పేరును ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ చేయడం గర్వకారణమని… టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడమే తనముందున్న లక్ష్యమని ప్రకటించాడు.

గతంలో జరిగిన ప్రపంచ కుస్తీ పోటీలలో కాంస్య, రజత పతకాలు మాత్రమే సాధించిన భజరంగ్ ఈసారి 65 కిలోల విభాగంలో స్వర్ణపతకం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  23 Aug 2019 5:35 AM IST
Next Story