వీళ్ళు బీజేపీ నేతలా? టీడీపీ అధికార ప్రతినిధులా?
బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల తీరుపై ఆపార్టీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాషాయ పార్టీలో చేరినా… వీరి తీరు మాత్రం టీడీపీ నేతల మాదిరిగానే ఉందనేది బీజేపీ నుంచి వస్తున్న కామెంట్స్. పోలవరం, రాజధాని నిర్మాణం విషయంలో గత కొన్ని రోజులుగా ఏపీలో మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీలో కొంత మంది నేతలు మాత్రం ఈ ఇష్యూ పై రియాక్ట్ అవుతున్నారు…. హడావుడి చేస్తున్నారు. మిగతా నేతలు మాత్రం సైలెంట్‌గా […]
బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల తీరుపై ఆపార్టీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాషాయ పార్టీలో చేరినా… వీరి తీరు మాత్రం టీడీపీ నేతల మాదిరిగానే ఉందనేది బీజేపీ నుంచి వస్తున్న కామెంట్స్.
పోలవరం, రాజధాని నిర్మాణం విషయంలో గత కొన్ని రోజులుగా ఏపీలో మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీలో కొంత మంది నేతలు మాత్రం ఈ ఇష్యూ పై రియాక్ట్ అవుతున్నారు…. హడావుడి చేస్తున్నారు. మిగతా నేతలు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు.
రాజధాని విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి చాలా మంది రియాక్ట్ కాలేదు. బీజేపీ నేత సుజనా చౌదరి వెంటనే ప్రెస్‌మీట్ పెట్టేశారు. చంద్రబాబుకు వంత పాడారు. సుజనా తీరుపై ఇప్పుడు బీజేపీతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సుజనా, సీఎం రమేష్‌లను పార్టీ లైన్‌లోకి తీసుకురాకపోతే భవిష్యత్‌లో పార్టీకి కష్టమవుతుందని రాష్ట్ర కమలం నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది.
రాజధాని మార్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు… విధాన ప్రకటన చేయలేదు… కేవలం మంత్రి బొత్స ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు…. రాజధాని తరలింపుపై రాష్ట్ర బీజేపీ వైఖరి, విధానాలు ఇంకా ఖరారు కానప్పటికీ.. సుజనా చౌదరి బాహటంగా విమర్శించడం తమ పార్టీని ఆత్మరక్షణలో పడేసిందని బీజేపీ నేతలు కొందరు అంటున్నారు.
సీఎం రమేష్ కూడా జగన్ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి అభాసుపాలయ్యాడు. ఈ ఇద్దరు ఎంపీల తీరు ఇలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని….వారి వల్ల వచ్చే లాభం ఏం లేదని బీజేపీ నేతలు కొందరు చెబుతున్నారు.
క్రియాశీల నేతలు బీజేపీలోకి రాకుండా వీరే అడ్డుపడుతున్నారని హైకమాండ్‌కు ఇప్పటికే ఫిర్యాదులు చేశారట.
మొత్తానికి సుజనా, సీఎం రమేష్ ల వ్యవహార శైలి బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. వారి పొలిటికల్ బిజినెస్‌లపై ఓ కన్నేసి ఉంచాలని పార్టీ హైకమాండ్ కు చెప్పారట. త్వరలోనే వారికి కీలక డైరెక్షన్ ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.