మోడీ ఫ్రాన్స్ పర్యటన.... ఆ యుద్ధ విమానం కోసమేనా?
భారత ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ తో తాడోపేడో తేల్చుకోవాలని రెడీ అయ్యాడా? అందుకే కశ్మీర్ అంశాన్ని తేల్చి… భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ కు గట్టి బుద్ది చెప్పడానికి రెడీ అయ్యాడా? పాక్ తో గనుక యుద్ధం వస్తే ఎదుర్కోవడానికే అత్యాధునిక రాఫెల్ విమానాలను తీసుకొచ్చే పనిలో పడ్డారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం భారత వైమానిక దళం వెనుకబడి ఉంది. పాకిస్తాన్ కు అత్యాధునిక అమెరికా తయారీ ఎఫ్ 16 యుద్ధ […]
భారత ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ తో తాడోపేడో తేల్చుకోవాలని రెడీ అయ్యాడా? అందుకే కశ్మీర్ అంశాన్ని తేల్చి… భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ కు గట్టి బుద్ది చెప్పడానికి రెడీ అయ్యాడా? పాక్ తో గనుక యుద్ధం వస్తే ఎదుర్కోవడానికే అత్యాధునిక రాఫెల్ విమానాలను తీసుకొచ్చే పనిలో పడ్డారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.
ప్రస్తుతం భారత వైమానిక దళం వెనుకబడి ఉంది. పాకిస్తాన్ కు అత్యాధునిక అమెరికా తయారీ ఎఫ్ 16 యుద్ధ విమానాలున్నాయి. కానీ ఇప్పటికీ భారత్ కు 80వ దశకంలో కొన్న రష్యన్ మిరాజ్ యుద్ధ విమానాలే దిక్కు.
అందుకే మోడీ ఇప్పుడు ఫ్రాన్స్ పర్యటన వెనుక అసలు ఉద్దేశం ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్ యుద్ధ విమానం ‘రాఫెల్’ను భారత్ కు అత్యంత వేగంగా తీసుకురావడమేనంటున్నారు. ఇప్పటికే భారత్ ఈ కాంట్రాక్టును ఫ్రాన్స్ కు ఇవ్వగా విమానాల తయారీ కూడా ఊపందుకుంది.
కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ తో ప్రధాని మోడీ భేటి అయ్యి ప్రధానంగా రక్షణ, పౌర అణుశక్తి, ఉగ్రవాదం, సముద్ర భద్రత విషయాల్లో కలిసి పనిచేయాలని ఒప్పందం చేసుకోబోతున్నట్టు తెలిసింది.
ఈ సందర్భంగా వచ్చే సెప్టెంబర్ లోనే ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కు తీసుకువచ్చేలా మోడీ ప్లాన్ చేసినట్టు సమాచారం.
పాకిస్తాన్ తో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాఫెల్ లాంటి జెట్ ఫైటర్లు ఉంటే పాకిస్తాన్ ను భయపెట్టవచ్చు. ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఉగ్రవాదులను ఏరివేయవచ్చు. రాడార్లకు చిక్కని సాంకేతికతతో ఉన్న ఈ రాఫెల్ విమానం.. పాకిస్తాన్ వద్ద ఉన్న ‘ఎఫ్16’ కంటే ఎంతో ఆధునికమైంది.
మోడీ అందుకే ఇప్పుడు రాఫెల్ కోసమే ఫ్రాన్స్ పర్యటన పెట్టుకున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.