చిదంబరానికి మరో షాక్
కేంద్రమాజీ మంత్రి చిదంబరానికి మరో షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. చిదంబరాన్ని ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. దాంతో కోర్టు నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్‌కు ఆయన్ను తరలించారు. ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీ ఉంటుంది. ప్రతి రోజు అరగంట పాటు కుటుంబసభ్యులతో చిదంబరం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చింది కోర్టు. లాయర్ల సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించింది. ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరాన్ని నిన్న సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ […]
కేంద్రమాజీ మంత్రి చిదంబరానికి మరో షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. చిదంబరాన్ని ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది.
దాంతో కోర్టు నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్‌కు ఆయన్ను తరలించారు. ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీ ఉంటుంది. ప్రతి రోజు అరగంట పాటు కుటుంబసభ్యులతో చిదంబరం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చింది కోర్టు. లాయర్ల సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించింది.
ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరాన్ని నిన్న సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ తర్వాత నేడు కోర్టు ముందు హాజరుపరిచింది. చిదంబరం బెయిల్ పిటిషన్ వేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది.