బీజేపీ... అక్కడ అలా... ఇక్కడ ఇలా...
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల ప్రెస్ మీట్లు చూస్తుంటే…. జనం గందరగోళానికి లోనవుతున్నారు. తెలంగాణలో నాలుగు సీట్లలో గెలవగానే ఇక్కడ బీజేపీ నాయకులు ఏదో విశ్వాన్నే జయించినంత సంబరపడిపోతున్నారు. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి…. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అన్న భ్రమలో ఉన్నారు. అందుకే చోటా మోటా నాయకులు కూడా కేసీఆర్ మీద ఆరోపణలు చేయగలుగుతున్నారు. కేసీఆర్ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో వాళ్ళకు అవినీతి మాత్రమే కనిపిస్తోంది. ప్రతిదానిమీద విచారణను కోరుకుంటున్నారు. కేసీఆర్ అవినీతిని నిగ్గుతేల్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. […]
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల ప్రెస్ మీట్లు చూస్తుంటే…. జనం గందరగోళానికి లోనవుతున్నారు. తెలంగాణలో నాలుగు సీట్లలో గెలవగానే ఇక్కడ బీజేపీ నాయకులు ఏదో విశ్వాన్నే జయించినంత సంబరపడిపోతున్నారు.
ఇక ఎన్నికలు జరగడమే తరువాయి…. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అన్న భ్రమలో ఉన్నారు. అందుకే చోటా మోటా నాయకులు కూడా కేసీఆర్ మీద ఆరోపణలు చేయగలుగుతున్నారు.
కేసీఆర్ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో వాళ్ళకు అవినీతి మాత్రమే కనిపిస్తోంది. ప్రతిదానిమీద విచారణను కోరుకుంటున్నారు. కేసీఆర్ అవినీతిని నిగ్గుతేల్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.
మంచిదే… కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. విచారణ జరిపించగలిగి…. అవినీతిని నిరూపించగలిగితే…. ప్రజలందరూ సంతోషపడతారు. మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇదంతా నాణానికి ఒకవైపు.
మరోవైపు…. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు మీదా ఇలాంటి ఆరోపణలే చేశారు. విచారణలు జరగాలన్నారు. చంద్రబాబు, వాళ్ళ అబ్బాయి అవినీతిని బయటపెట్టాలన్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నదీ బీజేపీనే. వాళ్ళు కోరుకున్నట్టు ఎలాంటి విచారణలూ జరగలేదు.
జగన్ అధికారంలోకి వచ్చాడు. విచారణలు ప్రారంభం అయ్యాయి. బీజేపీ వాళ్ళు కోరుకున్నది అదే. కానీ ఇప్పుడు ఆ విచారణలను బీజేపీ నాయకులు తప్పుబడుతున్నారు. పాలన మీద దృష్టి సారించకుండా జగన్ ప్రభుత్వం…. చంద్రబాబు ప్రభుత్వం పై అవినీతి ఆరోపణల మీద ఇప్పుడు దృష్టి సారించడం ఏమిటని నిలధీస్తున్నారు.
టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన నాయకులు అలా అన్నారంటే అర్థం ఉంది. కానీ కన్నాలక్ష్మీనారాయణ, మాణిక్యాల రావు లాంటి వాళ్ళు కూడా ఫ్లేటు ఫిరాయించడం ఏమిటో అర్థం కాదు. అప్పుడొక విధంగా… ఇప్పుడొక విధంగా మాట్లాడడం ప్రజలకు అయోమయంగా ఉంది.
అలాగే…. అవినీతి విషయంలో తెలంగాణలో ఒక విధంగా …. ఆంధ్రాలో మరో విధంగా బీజేపీ నాయకులు మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళే చెబితే బాగుంటుంది.