ఈ జ్యోతి ప్రజ్వలన చూడలేదా? సీఎం రమేష్...
జగన్ అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయకుండా తిరస్కరించారని… దీని బట్టి జగన్ హిందూ వ్యతిరేకి అన్నది స్పష్టమవుతోందంటూ… టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన సీఎం రమేష్ ట్వీట్ చేశాడు. నిజంగానే సీఎం రమేష్ లాంటివారు చేస్తున్న వాదనలో పస ఉందా? అన్నది గమనిస్తే…. ఇదంతా కేవలం ప్రజలను మతపరంగా రెచ్చగొట్టే తంతే అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ ఎన్నికలకు ముందు గుళ్ళ చుట్టూ తిరిగి హిందూ ఓటర్లను ప్రసన్నం […]
జగన్ అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయకుండా తిరస్కరించారని… దీని బట్టి జగన్ హిందూ వ్యతిరేకి అన్నది స్పష్టమవుతోందంటూ… టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన సీఎం రమేష్ ట్వీట్ చేశాడు.
నిజంగానే సీఎం రమేష్ లాంటివారు చేస్తున్న వాదనలో పస ఉందా? అన్నది గమనిస్తే…. ఇదంతా కేవలం ప్రజలను మతపరంగా రెచ్చగొట్టే తంతే అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.
జగన్ ఎన్నికలకు ముందు గుళ్ళ చుట్టూ తిరిగి హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారని… కానీ అధికారంలోకి రాగానే జ్యోతి ప్రజ్వలన కూడా అంగీకరించడం లేదన్నది సీఎం రమేష్ లాంటి వారి ఆరోపణ.
అయితే ఈనెల 9న విజయవాడలో 50కిపైగా దేశాల ప్రతినిధులతో డిప్లొమేటిక్ ఔట్ రిచ్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం ప్రారంభంలో జగన్ స్వయంగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
జగన్‌కు నిజంగా జ్యోతి ప్రజ్వలన ఇష్టం లేకపోతే ఈనెల 9న జరిగిన కార్యక్రమంలో ఆ పని ఎలా చేస్తారు? అని కొందరు సోషల్ మీడియాలో సీఎం రమేష్ కు కౌంటర్ ఇస్తున్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత కూడా చాలా గుళ్లకు వెళ్లారు. తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా వెళ్లారు.
ఇక అమెరికాలో జరిగిన కార్యక్రమాన్ని నిర్వహించిన స్టేడియంలో అక్కడి అధికారులు జ్యోతి వెలిగించడానికి నిబంధనల ప్రకారం అంగీకరించలేదు.
అగ్ని ప్రమాదాల భయంతో లోపలికి లైటర్లు గానీ, అగ్గిపెట్టెలను కానీ అక్కడ అనుమతించరు. దాంతో నిర్వాహకులు ఎలక్ట్రిక్ క్యాండిల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఆ సమయంలో కొందరు ఎలక్ట్రికల్ క్యాండిల్స్‌ను వెలిగిస్తున్నట్టు…. కెమెరా వైపు చూస్తూ పోజు ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు జగన్ అలాంటి కృత్తిమ పోజులకు అంగీకరించకుండా పక్కకు వెళ్లారు. అక్కడి రూల్స్ గురించి తెలియని సీఎం రమేష్ మాత్రం ఇలా జ్యోతిపైనా కామెంట్స్ చేశారు.