మానవత్వం గెలిచింది... సాయం మరణించింది...
గంపెడు కష్టాలలో ఉన్న ఆమె తనువు చాలించాలనుకుంది. నిండు ప్రాణాలను బలి తీసుకునేందుకు ఓ కాలువలో దూకింది. కాలువలో దూకిన ఆ యువతిని నలుగురు యువకులు రక్షించాలనుకుని కాలువలోకి దిగారు. వారిలో ఇద్దరు యువకులు యువతిని రక్షించి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మిగిలిన ఇద్దరు యువకులు మాత్రం ప్రవాహవేగంలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరి మృతదేహం దొరికింది. మరొకరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ మధురానగర్ […]
గంపెడు కష్టాలలో ఉన్న ఆమె తనువు చాలించాలనుకుంది. నిండు ప్రాణాలను బలి తీసుకునేందుకు ఓ కాలువలో దూకింది. కాలువలో దూకిన ఆ యువతిని నలుగురు యువకులు రక్షించాలనుకుని కాలువలోకి దిగారు. వారిలో ఇద్దరు యువకులు యువతిని రక్షించి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
అయితే మిగిలిన ఇద్దరు యువకులు మాత్రం ప్రవాహవేగంలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరి మృతదేహం దొరికింది. మరొకరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ మధురానగర్ కు చెందిన ఓ యువతికి ఏలూరుకు చెందిన ఓ యువకుడితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్తకు అనారోగ్యం అనే సంగతి వివాహం అయిన తర్వాత గుర్తించిన యువతి… తల్లిగారింటికి విజయవాడ వచ్చేసింది.
అత్తవారింటి వారి నుంచి కోడలను పంపాల్సిందిగా ఒత్తిడి వచ్చింది. యువతి తల్లి బలవంతంగానైనా అత్తవారింటికి పంపాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్యే శరణ్యమనుకుని విజయవాడలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రైవస్ కాలువలో దూకేసింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు యువకులు యువతిని కాపాడేందుకు కాలువలోకి దిగారు. వారిలో ఇద్దరు ఆ యువతిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ఇద్దరు యువకులు కాలువ ప్రవాహానికి కొట్టుకుపోయారు.
వీరిద్దరిలో ఒకరు దేవీనగర్ తాడేపల్లి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల సాయి అజయ్ కాగా… మరొకరు ఇబ్రహింపట్నం ఫ్రెర్రీ ప్రాంతానికి చెందిన బడుగు శివరామక్రిష్ణ (నాని). కాలువలో కొట్టుకుపోయిన ఈ ఇద్దరు యువకుల కోసం తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే మంగళవారం సాయంత్రం ఎనికేపాడు దగ్గర శివరామక్రిష్ణ మృతదేహం లభించింది. మరో యువకుడు అజయ్ కోసం గాలిస్తున్నారు. ఈ విషాధ ఘటనలో మరణించిన శివరామక్రిష్ణ వడ్రంగి కాగా… ఇంకా ఆచూకీ లభించని అజయ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.