Telugu Global
Cinema & Entertainment

అదిరిపోయే సాంగ్ తో 'వాల్మీకి'

ఈ మధ్యనే ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అధర్వ మురళి హీరోగా నటిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ […]

అదిరిపోయే సాంగ్ తో వాల్మీకి
X

ఈ మధ్యనే ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అధర్వ మురళి హీరోగా నటిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. తన మాస్ లుక్ తో వరుణ్ తేజ్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

తాజాగా ఇవాళ ఈ సినిమా నుంచి మొదటి పాట లిరికల్ వీడియో ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వరుణ్ తేజ్ లుక్ కి తగ్గట్టుగానే ఈ పాట కూడా ఎనర్జిటిక్ గా ఉంది.

మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. భాస్కరభట్ల రవికుమార్ అందించిన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ ఆచంట- గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది.

First Published:  21 Aug 2019 2:45 PM IST
Next Story