Telugu Global
National

చిదంబరం పిటిషన్‌ ఎన్వీ రమణ వద్దకు చేరుతుందా?

ఐఎన్‌ఎక్స్ కుంభకోణంలో ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం హైరానా పడ్డారు. ఏక్షణంలోనైనా అరెస్ట్ తప్పదన్న ఉద్దేశంతో అజ్ఞాతంలోకి జారుకున్నారు. బుధవారం ఉదయమే సీబీఐ అధికారులు చిదంబరంను అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని సిబ్బంది వెల్లడించడంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు. మరోవైపు ముందస్తు బెయిల్‌ కోసం చిదంబరం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. నిన్న ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌కు నో చెప్పిన […]

చిదంబరం పిటిషన్‌ ఎన్వీ రమణ వద్దకు చేరుతుందా?
X

ఐఎన్‌ఎక్స్ కుంభకోణంలో ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం హైరానా పడ్డారు. ఏక్షణంలోనైనా అరెస్ట్ తప్పదన్న ఉద్దేశంతో అజ్ఞాతంలోకి జారుకున్నారు.

బుధవారం ఉదయమే సీబీఐ అధికారులు చిదంబరంను అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని సిబ్బంది వెల్లడించడంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు.

మరోవైపు ముందస్తు బెయిల్‌ కోసం చిదంబరం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. నిన్న ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌కు నో చెప్పిన వెంటనే చిదంబరం సుప్రీంకోర్టుకు పరుగులు తీశారు.

చిదంబరం, మరో కాంగ్రెస్ నేత, ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ ఇద్దరూ సుప్రీం కోర్టు లాబీల్లో పరుగులు తీశారు. వేగంగా నడుచుకుంటూ చిదంబరం, కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులు అయిన సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ మను సింఘ్వి, కపిల్ హుటాహుటీనా సుప్రీం కోర్టు సీజే రంజన్‌ గొగోయ్‌ చాంబర్‌ వద్దకు వెళ్లారు. అత్యవసరంగా తమ విజ్ఞప్తి ఆలకించాలని కోరారు. కానీ వారిని చాంబర్‌లోకి సీజే అనుమతించలేదు.

ఇంతలో కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించే ఒక కీలక అధికారి వద్ద కపిల్ సిబల్ సలహా తీసుకున్నారు. బుధవారం ఉదయమే మొదటి గంటలోనే విచారణకు వచ్చేలా చేయాలంటే నేరుగా రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి పిటిషన్ అందజేయాలని సదరు అధికారి సూచించారు.

దాంతో, సిబలే స్వయంగా రిజిస్ట్రార్‌ దగ్గరకు వెళ్లి ఆ పిటిషన్‌ను సమర్పించారు. బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి అయోధ్య కేసు విచారణలో ఉంటారు కాబట్టి… చిదంబరం పిటిషన్‌ జస్టిస్ ఎన్‌వీ రమణ వద్దకు వచ్చేలా ఉంది.. ఈ పిటిషన్‌ను పరిశీలించే బాధ్యతను జస్టిస్‌ ఎన్వీ రమణకు అప్పగించవచ్చని కపిల్‌ సిబల్‌ కూడా వ్యాఖ్యానించడం విశేషం.

First Published:  20 Aug 2019 9:57 PM GMT
Next Story