ఫేస్‌బుక్‌కు ఆధార్ లింక్ ?
ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్‌లకు ఆధార్ లింక్ చేయడంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి పలువురు విద్వేష ప్రచారం, హింసకు ప్రేరేపించే ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని అడ్డుకోవాలంటే సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం ఒకటే మార్గమని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం ద్వారా తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటూ తమిళనాడు హైకోర్టులో రెండు, మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒకటి, బాంబే హైకోర్టులో […]
ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్‌లకు ఆధార్ లింక్ చేయడంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి పలువురు విద్వేష ప్రచారం, హింసకు ప్రేరేపించే ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని అడ్డుకోవాలంటే సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం ఒకటే మార్గమని తమిళనాడు ప్రభుత్వం వాదించింది.
సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం ద్వారా తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటూ తమిళనాడు హైకోర్టులో రెండు, మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒకటి, బాంబే హైకోర్టులో ఒకటి చొప్పున దేశవ్యాప్తంగా నాలుగు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కావాలంటే అకౌంట్లకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ తప్పనిసరి చేస్తామని… ఆధార్ లింక్ అన్నది ప్రజల గోప్యత హక్కు ఉల్లంఘనే అవుతుందని ఫేస్‌బుక్ వాదించింది.
తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఫేస్‌బుక్ వాదనను తోసి పుచ్చింది. తప్పుడు వార్తలను, పరువునష్టం కలిగించే వార్తలను, అశ్లీల చిత్రాలు, వీడియోలను, దేశ వ్యతిరేక, ఉగ్రవాద సందేశాలను అరికట్టడానికి… సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం అత్యవసరం అని తమిళనాడు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు.
ఆధార్‌తో లింక్ చేస్తే ఒక వ్యక్తికి ఒక సోషల్ మీడియా ఖాతా మాత్రమే ఉంటుందని… అప్పుడు నకిలీ ఖాతా సాయంతో విద్వేష ప్రచారం, సమాజంలో అలజడి సృష్టించే ప్రచారానికి చెక్ పడుతుందని వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.