దొనకొండలో రియల్ భూమ్
ఏపీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి, పైగా మున్సిపల్ శాఖ చూస్తున్న బొత్స సత్యనారాయణ తాజా వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏపీ రాజధాని అమరావతి అనువైన ప్రదేశం కాదని.. వరద ముంపు పొంచి ఉందని.. దీనిపై సమాలోచనలు చేస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది. బోత్సా ప్రకటనతో ఏపీ రాజధాని అమరావతిని మార్చేస్తున్నారని టీడీపీ గగ్గోలు పెడుతోంది. కాగా బోత్సా ప్రకటన తర్వాత ఏపీలో రాజధాని మారబోతోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకాశం […]
ఏపీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి, పైగా మున్సిపల్ శాఖ చూస్తున్న బొత్స సత్యనారాయణ తాజా వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏపీ రాజధాని అమరావతి అనువైన ప్రదేశం కాదని.. వరద ముంపు పొంచి ఉందని.. దీనిపై సమాలోచనలు చేస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది. బోత్సా ప్రకటనతో ఏపీ రాజధాని అమరావతిని మార్చేస్తున్నారని టీడీపీ గగ్గోలు పెడుతోంది.
కాగా బోత్సా ప్రకటన తర్వాత ఏపీలో రాజధాని మారబోతోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని దొనకొండను ఎంపిక చేసిందని.. అక్కడికి రాజధానిని తరలిస్తారనే ప్రచారం సాగుతోంది.
దీంతో ఇప్పుడు దొనకొండలో రియల్ భూమ్ నెలకొంది. దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూములపై నేతలు, స్థానికులు కన్నేశారు. పెద్ద ఎత్తున డబ్బులు ఆఫర్ చేస్తూ కొనుగోలుకు రెడీ కావడం చర్చనీయాంశంగా మారింది.
దొనకొండలో ఇప్పుడు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ భూములు భారీగా ఉన్నాయి. పైగా రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. వైసీపీ నేతలు ఇప్పటికే భూములు కొన్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రాజధానిని గనుక దొనకొండకు మార్చిస్తే ముందే సర్ధుకుందామని చాలా మంది ఇక్కడ భూములు కొనేందుకు ముందుకు వస్తున్నారట.. ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి ధర 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంది. దొనకొండ రాజధాని అనే ప్రచారంతో ఇప్పుడు ధర ఎకరం కోటికి చేరిందని సమాచారం.
అయితే రాజధాని మార్పుపై అందరూ ఆందోళనగా ఉన్నా దొనకొండ రైతులు మాత్రం తెగ హ్యాపీగా ఉన్నారు. కోట్ల రూపాయల డిమాండ్ తమ భూములకు వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.