వరద బాధితుల దగ్గరా కరకట్ట ఇంటి కబుర్లే చెబుతున్న బాబు
అబ్బే చంద్రబాబు మారలేదు. ఇక మారుతారన్నా అనుమానమే. 23 సీట్లకు పడిపోయినా సరే తప్పు తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా… పైగా అన్నీ చేశా…. అయినా ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదంటూ నిజాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే సాహసం చేయలేకపోతున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు అదే తరహాలో ఉంది. అక్కడికి వెళ్లి బాధితుల పరిస్థితిని ఆరా తీయాల్సిన చంద్రబాబు… అక్కడ కూడా తన కరకట్ట అక్రమ నివాసం కబుర్లే పదేపదే […]
అబ్బే చంద్రబాబు మారలేదు. ఇక మారుతారన్నా అనుమానమే. 23 సీట్లకు పడిపోయినా సరే తప్పు తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా… పైగా అన్నీ చేశా…. అయినా ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదంటూ నిజాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే సాహసం చేయలేకపోతున్నారు.
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు అదే తరహాలో ఉంది. అక్కడికి వెళ్లి బాధితుల పరిస్థితిని ఆరా తీయాల్సిన చంద్రబాబు… అక్కడ కూడా తన కరకట్ట అక్రమ నివాసం కబుర్లే పదేపదే చెప్పారు.
తన ఇంటిని ముంచాలన్న ఉద్దేశంతోనే…. ప్రజల ఇళ్లు ముంచారంటూ చంద్రబాబు పదేపదే ఆరోపించారు. ఇక్కడే చంద్రబాబు ఆలోచనా విధానం గమనించాలి. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న కరకట్ట భవనం ఒక అక్రమ నిర్మాణం. దాన్ని నదీ గర్భంలో కట్టారు. చంద్రబాబు రాత బాగుండి… ఏపీ ప్రజలకు దురదృష్టం వెంటాడి ఐదేళ్ల పాటు ఏనాడూ కృష్ణా నదిలో సరిపడ నీరు రాలేదు. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ నిండి, నీరు దిగువకు వచ్చి తన ఒడ్డున నిర్మించిన కరకట్ట అక్రమ కొంపలను కృష్ణమ్మ ఒక చూపు చూసి వెళ్లింది.
ఇలా నదీ గర్భంలో ఒక అక్రమ నివాసంలో అక్రమంగా నివాసం ఉన్నందుకు ఎవరైనా సిగ్గుపడుతారు. వీలైనంత వరకు అక్రమ నిర్మాణంపై చర్చ జరగకుండా దాచుకుంటారు. చంద్రబాబు మాత్రం కరకట్ట నివాసం ఒక స్వచ్చమైన నిర్మాణం అన్నట్టు పదేపదే తన ఇంటిని ముంచాలని చూశారంటున్నారు. సాధారణంగా కృష్ణమ్మకు భారీ వరద సెప్టెంబర్‌లో వస్తుంటుంది. ఈసారి ఆగస్టులోనే ప్రతాపం చూపింది. మరోసారి సెప్టెంబర్‌లో కృష్ణమ్మ ఉగ్రరూపం చూపిస్తే అప్పుడు కూడా వరద కుట్ర అంటారా?.
40 ఏళ్ల రాజకీయం అని చెప్పుకునే చంద్రబాబు ఇంత దిగువ స్థాయిలో విమర్శలు చేసేందుకు సిద్ధపడడం ప్రజల దురదృష్టం. తండ్రికి తగ్గ తనయుడిగానే లోకేష్ బాబు ఏకంగా పడవ అడ్డుపెట్టి లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఆపేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు అర్థం అయినా కాకపోయినా ఆయన కరకట్టను ఖాళీ చేసేంత వరకు నిప్పు మాత్రం కాబోరు.