వైఎస్ ‘రచ్చబండ’.... జగన్ ప్రారంభిస్తున్నాడు
సంక్షేమ పథకాలను ఘనంగా ప్రకటించారు జగన్. నవరత్నాలతో… తన అమ్ములపొదిలోని అస్త్రాలు వాడేసారు. ఇక అంతా అయిపోయినట్టేనా.? జగన్ మొదటి రోజు నుంచే ఏపీ పాలనను పట్టాలెక్కించేందుకు వడివడిగా నిర్ణయాలు తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పరుగులు పెట్టించారు. సరైన వారిని సరైన స్థానాల్లో నియమించారు. ఈ మూడు నెలల్లో పాలన తీరు, వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికి అన్ని విభాగాలతో సమీక్షలు జరిపారు… దూకుడుగా ముందుకెళ్లాడు. అయితే నవరత్నాల అమలుకు ప్రధానంగా నిధుల కొరత.. ధీర్గకాలిక […]
సంక్షేమ పథకాలను ఘనంగా ప్రకటించారు జగన్. నవరత్నాలతో… తన అమ్ములపొదిలోని అస్త్రాలు వాడేసారు. ఇక అంతా అయిపోయినట్టేనా.? జగన్ మొదటి రోజు నుంచే ఏపీ పాలనను పట్టాలెక్కించేందుకు వడివడిగా నిర్ణయాలు తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పరుగులు పెట్టించారు. సరైన వారిని సరైన స్థానాల్లో నియమించారు.
ఈ మూడు నెలల్లో పాలన తీరు, వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికి అన్ని విభాగాలతో సమీక్షలు జరిపారు… దూకుడుగా ముందుకెళ్లాడు. అయితే నవరత్నాల అమలుకు ప్రధానంగా నిధుల కొరత.. ధీర్గకాలిక చిక్కుముడులు… ఇలా అధికారుల సూచనలను, సలహాలను ఇలా ఎన్నో విన్నారు. ఇక జగన్ తో పాటు మెజార్టీ మంత్రులు కొత్తవారే కావడంతో పరిపాలనలో అనుభవం లేక పాలనపై పట్టుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో ఎంతో దిగ్విజయంగా ప్రవేశపెట్టిన ఈ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? లేదా..? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలా ఎన్నో అనుమానాలు జగన్ లో కలుగుతున్నాయని సమాచారం.
అందుకే సెప్టెంబర్ నుంచి జగన్ రచ్చబండను మొదలు పెడుతున్నారు. 2009లో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే రచ్చబండ ప్రారంభానికి వెళ్తూ హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు.
ఇప్పుడు జగన్ తండ్రి వదలిన అదే అద్భుత ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని అదే చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభిస్తుండడం విశేషంగా చెప్పవచ్చు. మరి జగన్ రచ్చబండతో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచిచూడాలి.