Telugu Global
NEWS

సాక్షీ మాలిక్ కు షోకాజ్ నోటీసు... ఎందుకంటే...

కుస్తీ శిబిరానికి డుమ్మా కొట్టిన రియో మెడలిస్ట్ ఒలింపిక్స్ కుస్తీ మహిళల విభాగంలో భారత్ కు పతకం అందించిన తొలి మహిళా వస్తాదు సాక్షీ మాలిక్ కు..జాతీయ కుస్తీ సమాఖ్య షోకాజ్ నోటీసు జారీ చేసింది. లక్నోలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరం నుంచి..సాక్షీతో సహా 25 మంది రెజ్లర్లు అనుమతి లేకుండా స్వస్థలాలకు వెళ్లిపోవడాన్ని కుస్తీ సమాఖ్య తీవ్రంగా పరిగణించింది. దేశంలోని యువవస్తాదులకు ఆదర్శంగా నిలవాల్సిన సాక్షి మాలిక్ క్రమశిక్షణ ఉల్లంఘించడం ఏమాత్రం సమర్థనీయం కాదని.. […]

సాక్షీ మాలిక్ కు షోకాజ్ నోటీసు... ఎందుకంటే...
X
  • కుస్తీ శిబిరానికి డుమ్మా కొట్టిన రియో మెడలిస్ట్

ఒలింపిక్స్ కుస్తీ మహిళల విభాగంలో భారత్ కు పతకం అందించిన తొలి మహిళా వస్తాదు సాక్షీ మాలిక్ కు..జాతీయ కుస్తీ సమాఖ్య షోకాజ్ నోటీసు జారీ చేసింది.

లక్నోలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరం నుంచి..సాక్షీతో సహా 25 మంది రెజ్లర్లు అనుమతి లేకుండా స్వస్థలాలకు వెళ్లిపోవడాన్ని కుస్తీ సమాఖ్య తీవ్రంగా పరిగణించింది.

దేశంలోని యువవస్తాదులకు ఆదర్శంగా నిలవాల్సిన సాక్షి మాలిక్ క్రమశిక్షణ ఉల్లంఘించడం ఏమాత్రం సమర్థనీయం కాదని.. శిబిరం నుంచి విరమించుకోడానికి తగిన కారణం వివరించాలని కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ప్రపంచ కుస్తీ పోటీల కోసం లక్నోలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో మొత్తం 45 మంది వస్తాదులు పాల్గొన్నారు. అయితే… వీరిలో 25 మంది అర్థంతరంగా వైదొలిగారు.

ఈ 25 మందిలో సాక్షీ మాలిక్, సీమా బిస్లా, కిరణ్ లాంటి మేటి వస్తాదులు ఉన్నారు.

ప్రపంచ కుస్తీ పోటీలలో పాల్గొనటానికి నిర్వహించిన అర్హత పోటీలలో సాక్షీ, సీమా, కిరణ్ తమతమ విభాగాలలో విజేతలుగా నిలవటం విశేషం.

First Published:  20 Aug 2019 5:16 AM IST
Next Story