నవయుగ కొత్త ఎత్తుగడ
ఈనాడు పత్రికాధినేత వియ్యంకుడికి చెందిన, చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నవయుగ సంస్థ రూట్ మార్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ఆ సంస్థ కోల్పోయింది. భూములు తీసుకుని నిర్మాణం చేయని నేపథ్యంలో బందరుపోర్టు కాంట్రాక్టును కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా వరుసగా తనకు ఎదురుదెబ్బలు తగులుతుండడంతో కొత్త వ్యూహానికి తెరలేపారు. ఇప్పటికే అంబానీ కంపెనీలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు అండ్ టీం… ఇప్పుడు ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన […]
ఈనాడు పత్రికాధినేత వియ్యంకుడికి చెందిన, చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నవయుగ సంస్థ రూట్ మార్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ఆ సంస్థ కోల్పోయింది. భూములు తీసుకుని నిర్మాణం చేయని నేపథ్యంలో బందరుపోర్టు కాంట్రాక్టును కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.
ఇలా వరుసగా తనకు ఎదురుదెబ్బలు తగులుతుండడంతో కొత్త వ్యూహానికి తెరలేపారు. ఇప్పటికే అంబానీ కంపెనీలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు అండ్ టీం… ఇప్పుడు ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన అదానీకి గాలం వేశారు.
జగన్ దూకుడును తట్టుకుని నిలబడాలంటే కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడం మాత్రమే మార్గమని భావించిన నవయుగ కంపెనీ తాను నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టులో వాటాను అదానీ గ్రూప్‌కు అప్పగిస్తోంది. 70 శాతం వాటాను అదానీకి ఇవ్వబోతోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ ప్రతినిధులు కొద్దిరోజులుగా కృష్ణపట్నం పోర్టును పరిశీలిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
హఠాత్తుగా కృష్ణపట్నం పోర్టులో 70 శాతం వాటాను అదానీకి అప్పగించడం వెనుక నవయుగ పెద్ద ప్లాన్ ఉందంటున్నారు. ఏపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టును నిర్మించాలని కేంద్రాన్ని కోరుతోంది. విభజన చట్టంలో కూడా పోర్టు నిర్మాణానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అటు బందరు పోర్టును సొంతంగా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఒకవేళ రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం అంగీకరిస్తే కృష్ణపట్నం పోర్టు నిర్వాహకులకు ఆదాయం భారీగా పడిపోనుంది. కాబట్టి కృష్ణపట్నం పోర్టులో వాటాను అదానికి అప్పగిస్తే… రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా ఆయనే అడ్డుకుంటారన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు.
ప్రధాని మోడీకి అదాని అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన్ను కాదని రామాయపట్నం నిర్మాణానికి కేంద్రం ముందుకు రాదన్నది వీరి ఆలోచనగా చెబుతున్నారు.