కీర్తి సురేష్ విషయంలో.... సమంతా సైలెంట్?
మహానటి అనగానే సావిత్రి పేరు టక్కున గుర్తు వస్తుంది అందరికీ. అంతే కాకుండా ఇప్పుడు తరం ఆడియన్స్ కి మహానటి అనగానే గుర్తు కి వచ్చే పేరు కీర్తి సురేష్. సావిత్రి జీవితం ఆధారం గా తీసిన మహానటి సినిమా లో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్…. తనదైన శైలి లో అందరినీ మెప్పించి, విమర్శకులని, వీక్షకులని, సినిమా పెద్దలని ఆకట్టుకున్న కీర్తి… ఇటీవలే నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ […]

మహానటి అనగానే సావిత్రి పేరు టక్కున గుర్తు వస్తుంది అందరికీ. అంతే కాకుండా ఇప్పుడు తరం ఆడియన్స్ కి మహానటి అనగానే గుర్తు కి వచ్చే పేరు కీర్తి సురేష్.
సావిత్రి జీవితం ఆధారం గా తీసిన మహానటి సినిమా లో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్…. తనదైన శైలి లో అందరినీ మెప్పించి, విమర్శకులని, వీక్షకులని, సినిమా పెద్దలని ఆకట్టుకున్న కీర్తి… ఇటీవలే నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది.
కీర్తి సురేష్ కి బెస్ట్ యాక్టరస్ గా నేషనల్ అవార్డు రావడం తో ఆనందించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.
అయితే ఈ సినిమా కి నేషనల్ అవార్డు ప్రకటించగానే ఎంతో మంది కీర్తిని అభినందించారు. మహానటి దర్శక నిర్మాతలు సైతం కీర్తి ని అభినందించే విషయం లో ముందన్నారు….. కానీ అదే సినిమా లో ఒక ముఖ్య పాత్ర పోషించిన సమంత మాత్రం ఎందుకో కీర్తి సురేష్ ను విష్ చేయలేదు…. కనీసం ఇప్పటివరకు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఇప్పటికైనా సమంతా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.