Telugu Global
NEWS

భారత వండర్ సైక్లిస్ట్ ఏసో అల్బెన్

వారంరోజుల్లో ప్రపంచ మూడో పతకం రెండు విభాగాలలో ప్రపంచ నంబర్ వన్ ఏసో భారత యువ సైక్లిస్ట్, 18 ఏళ్ల ఏసో అల్బెన్…వారంరోజుల వ్యవధిలో ప్రపంచ జూనియర్ సైక్లింగ్ లో మూడో పతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఈ ఘనత సొంతం చేసుకొన్న భారత తొలి సైక్లిస్ట్ గా రికార్డుల్లో చేరాడు. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ జూనియర్ స్ర్పింట్ సైక్లింగ్ విభాగం టీమ్, వ్యక్తిగత అంశాలలో ఏకంగా మూడు పతకాలు సొంతం చేసుకొన్నాడు. […]

భారత వండర్ సైక్లిస్ట్ ఏసో అల్బెన్
X
  • వారంరోజుల్లో ప్రపంచ మూడో పతకం
  • రెండు విభాగాలలో ప్రపంచ నంబర్ వన్ ఏసో

భారత యువ సైక్లిస్ట్, 18 ఏళ్ల ఏసో అల్బెన్…వారంరోజుల వ్యవధిలో ప్రపంచ జూనియర్ సైక్లింగ్ లో మూడో పతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఈ ఘనత సొంతం చేసుకొన్న భారత తొలి సైక్లిస్ట్ గా రికార్డుల్లో చేరాడు.

జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ జూనియర్ స్ర్పింట్ సైక్లింగ్ విభాగం టీమ్, వ్యక్తిగత అంశాలలో ఏకంగా మూడు పతకాలు సొంతం చేసుకొన్నాడు.

టీమ్ విభాగంలో భారత్ కు స్ర్పింట్ బంగారు పతకం అందించిన ఏసో అల్బెన్… స్ప్ర్రింట్ వ్యక్తిగత విభాగంలో రజత, కీరిన్ విభాగంలో కాంస్య పతకాలు సాధించాడు.

అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన అల్బెన్ గత ఏడాది స్విట్జర్లాండ్ లో ముగిసిన 2018 ప్రపంచ జూనియర్ సైక్లింగ్ పోటీలలో రజత పతకం సాధించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

ప్రస్తుత 2019 ప్రపంచ జూనియర్ సైక్లింగ్ పోటీలలో అంతకు మించి మూడు పతకాలతో వారేవ్వా అనిపించుకొన్నాడు.

ప్రపంచ జూనియర్ సైక్లింగ్ స్ప్ర్రింట్ కీరిన్ విభాగాల వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో అల్బెన్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్నాడు. భారత్ కు చెందిన ఓ సైక్లిస్ట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం ఇదే మొదటిసారి.

First Published:  19 Aug 2019 11:42 PM GMT
Next Story