అద్భుతం.... చంద్రయాన్ 2 మరో ఫీట్....
జాబిల్లిపై దించి దాని గుట్టుమట్లు తెలుసుకునేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 మరో అద్భుతమైన ఫీట్ సాధించింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి పంపిన ఈ చంద్రయాన్ 2 తాజాగా మంగళవారం ఉదయం 9.30కు గంటలకు చంద్రుడి కక్ష్యలోకి చేరి శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది. దీంతో చంద్రయాన్2 వ్యోమనౌక అనుకున్న లక్ష్యంలో తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రయాన్ 2లో భూ స్థిర కక్ష నుంచి చంద్రుడి కక్ష్యలోకి చేరడమే అతి కీలకమైన క్లిష్టతరమైన ఘట్టం.. […]
జాబిల్లిపై దించి దాని గుట్టుమట్లు తెలుసుకునేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 మరో అద్భుతమైన ఫీట్ సాధించింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి పంపిన ఈ చంద్రయాన్ 2 తాజాగా మంగళవారం ఉదయం 9.30కు గంటలకు చంద్రుడి కక్ష్యలోకి చేరి శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది. దీంతో చంద్రయాన్2 వ్యోమనౌక అనుకున్న లక్ష్యంలో తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
చంద్రయాన్ 2లో భూ స్థిర కక్ష నుంచి చంద్రుడి కక్ష్యలోకి చేరడమే అతి కీలకమైన క్లిష్టతరమైన ఘట్టం.. దీన్ని చంద్రయాన్2 బూస్టర్లను మండించడం ద్వారా ఇస్త్రో శాస్త్రవేత్తలు దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఇప్పుడు ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతారు. ఉపగ్రహంలోని ద్రవ ఇంజన్ ను మండిస్తారు. చంద్రయాన్ 2 వేగాన్ని తగ్గించి చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్నాక మెల్లిగా చంద్రుడి ఉపరితలంపై దించుతారు. సెప్టెంబర్ 2న ల్యాండర్ పై రెండు సార్లు దీన్ని సాఫీగా చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను ఇస్త్రో శాస్త్రవేత్తలు చేపడుతారు.
ఇప్పుడు చంద్రయాన్2 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. ఆతర్వాత సెప్టెంబర్ 7న తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల వరకు చంద్రుడిపై జాగ్రత్తగా ల్యాండింగ్ చేస్తారు. ల్యాండర్ దిగగానే అందులోని ఆరు చక్రాల రోవర్ నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చి 14 రోజుల పాటు చంద్రుడిపై 500 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ సేకరించిన వివరాలను ల్యాండర్ ద్వారా 15 నిమిషాలకు భూమికి చేరవేస్తుంది.