ట్రయిలర్ టాక్ : కౌసల్య కృష్ణమూర్తి
తమిళం లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన సినిమా ‘కనా’. ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా లో హీరోయిన్. అయితే ఈ సినిమా ని ఇప్పుడు తెలుగు లో రీమేక్ చేశారు. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వం లో… క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థలో…. కె ఎస్ రామారావు నిర్మాణ సారథ్యం లో ఈ సినిమాను నిర్మించారు. ఈ తెలుగు రీమేక్ లో కూడా ఐశ్వర్య రాజేషే హీరోయిన్ గా నటించింది. శివ కార్తికేయన్ ఒక […]
తమిళం లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన సినిమా ‘కనా’. ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా లో హీరోయిన్. అయితే ఈ సినిమా ని ఇప్పుడు తెలుగు లో రీమేక్ చేశారు. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వం లో… క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థలో…. కె ఎస్ రామారావు నిర్మాణ సారథ్యం లో ఈ సినిమాను నిర్మించారు. ఈ తెలుగు రీమేక్ లో కూడా ఐశ్వర్య రాజేషే హీరోయిన్ గా నటించింది. శివ కార్తికేయన్ ఒక ముఖ్య పాత్ర లో నటించాడు.
అయితే ఈ సినిమా ని తీయడం లో ఎంతో శ్రమ ఉందని దర్శక నిర్మాతలు ముందు నుంచి చెప్తూ వచ్చారు. క్రికెట్ నేపథ్యం లో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా ఇప్పుడు ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే పేరు తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని దర్శక నిర్మాతలు ఈ రోజు విడుదల చేశారు.
ట్రైలర్ ఎంతో ఆసక్తికరం గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఐశ్వర్య కి తెలుగు లో ఇది మొదటి సినిమా. ఈ సినిమా మంచి ఎమోషన్ తో ముందుకు సాగేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.