Telugu Global
CRIME

ఫేస్‌బుక్ పరిచయంతో 12 లక్షల రూపాయలు హాంఫట్

సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మోస పోయే వారి సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఇంతకు ముందు బహుమతులు వచ్చాయనో.. లాటరీ తగిలిందనో ఫోన్ ద్వారా సంప్రదించి డబ్బులు గుంజేసిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. అలా ఫేస్‌బుక్ ఫ్రెండ్షిప్ ద్వారా 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడో నగరవాసి. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని రామాంతాపూర్ ఇందిరానగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఒక మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ […]

ఫేస్‌బుక్ పరిచయంతో 12 లక్షల రూపాయలు హాంఫట్
X

సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మోస పోయే వారి సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఇంతకు ముందు బహుమతులు వచ్చాయనో.. లాటరీ తగిలిందనో ఫోన్ ద్వారా సంప్రదించి డబ్బులు గుంజేసిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. అలా ఫేస్‌బుక్ ఫ్రెండ్షిప్ ద్వారా 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడో నగరవాసి. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని రామాంతాపూర్ ఇందిరానగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఒక మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తన పేరు సాండ్రా ఐడా అండర్సన్‌ అనీ.. తాను టెక్సాస్‌లో ఉంటానని చెప్పి చాటింగ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ వాట్సప్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని దాంట్లో చాటింగ్ చేశారు.

ఇలాంటి సమయంలోనే బాధితుడి చిరునామా అడిగింది. ఎందుకని ప్రశ్నించగా.. మన స్నేహానికి గుర్తుగా విదేశీ కరెన్సీని, బహుమతులను పార్సిల్ చేస్తానని చెప్పింది. త్వరలోనే కొరియర్ పంపుతానని చెప్పింది. ఇక అక్కడి నుంచి అసలు నాటకం మొదలైంది.

మూడు రోజుల తర్వాత విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నామంటూ ఫిలిప్, అనిత శర్మ పేర్ల నుంచి బాధితుడికి కాల్స్ వచ్చాయి. మీకు ఒక పార్సిల్ వచ్చిందనీ.. ఆ పార్సిల్ మీకు పంపాలంటే డెలివరీ చార్జీలు అకౌంట్లో వేయాలని కోరారు.

మరోసారి కస్టమ్స్ టాక్స్ అనీ, జీఎస్టీ అనీ, విదేశీ మారకపు పన్ను అంటూ వివిధ పేర్లతో దాదాపు 12 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత అన్ని ఫోన్లు స్విచ్చాఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశాడు.

అపరిచితుల నుంచి బహుమతులు, లాటరీల పేరిట వచ్చే కాల్స్ అటెంప్ట్ చేయవద్దని, అనుమానం ఉంటే పోలీసులకు పిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

First Published:  19 Aug 2019 5:04 AM IST
Next Story