Telugu Global
NEWS

బీజేపీలో చేరడానికి టీఆర్ఎస్ నేత యత్నం.... అడ్డుకుంటున్న బీజేపీ నేతలు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పలు పార్టీల్లోని నేతలు కార్పొరేటర్ సీట్లపై కన్నేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీలో టికెట్‌ను కన్ఫార్మ్ చేసుకొని రంగంలోకి దిగాలని చాలా మంది కింది స్థాయి నేతలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన ఒక నేత బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఇదే నేత 2014లో అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ సీటు కోసం అప్పటి మంత్రి పద్మారావు ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. […]

బీజేపీలో చేరడానికి టీఆర్ఎస్ నేత యత్నం.... అడ్డుకుంటున్న బీజేపీ నేతలు
X

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పలు పార్టీల్లోని నేతలు కార్పొరేటర్ సీట్లపై కన్నేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీలో టికెట్‌ను కన్ఫార్మ్ చేసుకొని రంగంలోకి దిగాలని చాలా మంది కింది స్థాయి నేతలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన ఒక నేత బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

గతంలో ఇదే నేత 2014లో అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ సీటు కోసం అప్పటి మంత్రి పద్మారావు ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. కాని అధిష్టానం అతనికి మొండి చేయి చూపింది. అప్పటి నుంచి మంత్రి వెంటే ఉన్నా.. ఈ సారి కూడా తనకు టికెట్ రావడం కష్టమనే విషయం తెలిసిపోయింది. దీంతో బీజేపీలో చేరాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు సదరు నేత ఇటీవల సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఒక అర్థరాత్రి తన అనుచరులతో రహస్యంగా కలిశారు. డివిజన్‌లో తనకు ఉన్న బలాబలాల గురించి వివరించినట్లు తెలిసింది.

కాగా, సదరు నేత బీజేపీలోకి రావడానికి నగరానికి చెందిన కొందరు బీజేపీ నేతలు, అడ్డగుట్ట కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నాయకుడిని బీజేపీలోనికి తీసుకోవద్దని.. అతడిని పార్టీలోకి తీసుకుంటే ఎలాంటి సహాయ సహకారాలు అందించమని కిషన్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు నేతను బీజేపీలోకి ఆహ్వానించాలా వద్దా అని డైలమాలో పడ్డారట బీజేపీ పెద్దలు.

First Published:  19 Aug 2019 5:16 AM IST
Next Story