సినిమా ఫ్లాప్ కాదు.... కొన్ని గ్రూపులు కావాలనే నెగెటివ్ ప్రచారం చేశాయి
మొన్నటికి మొన్న ఇండస్ట్రీపై నాగార్జున కామెంట్ చేశాడు. మన్మథుడు-2 సినిమాకు నెగెటివ్ టాక్ కేవలం ఇండస్ట్రీలో ఉందని, జనాల్లో లేదని సంచలన వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు అదే మాట విజయ్ దేవరకొండ అంటున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమా బాగున్నప్పటికీ, కావాలనే పరిశ్రమలోని కొందరు వ్యక్తులు నెగెటివ్ టాక్ తో ఆ సినిమాను ప్లాప్ చేశారని అంటున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఈ హీరో, ఇండస్ట్రీలో తను ఎవ్వరికీ […]
మొన్నటికి మొన్న ఇండస్ట్రీపై నాగార్జున కామెంట్ చేశాడు. మన్మథుడు-2 సినిమాకు నెగెటివ్ టాక్ కేవలం ఇండస్ట్రీలో ఉందని, జనాల్లో లేదని సంచలన వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు అదే మాట విజయ్ దేవరకొండ అంటున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమా బాగున్నప్పటికీ, కావాలనే పరిశ్రమలోని కొందరు వ్యక్తులు నెగెటివ్ టాక్ తో ఆ సినిమాను ప్లాప్ చేశారని అంటున్నాడు విజయ్ దేవరకొండ.
డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఈ హీరో, ఇండస్ట్రీలో తను ఎవ్వరికీ పోటీ కాదని, అలాంటిది తనపై ఎందుకు ఇలా కక్ష కడుతున్నారో అర్థంకావడం లేదన్నాడు. తన సినిమాకు నెగెటివ్ టాక్ తెచ్చిన గ్రూపులు కూడా తనకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ.
అక్కడితో ఆగితే అతడు విజయ్ దేవరకొండ ఎందుకు అవుతాడు. టాలీవుడ్ కంటే బాలీవుడ్ చాలా బెటర్ అంటూ మరో స్టేట్ మెంట్ పడేశాడు. బాలీవుడ్ లో ఇంత నెగెటివిటీ ఉండదని, ఇన్ని గ్రూపులు ఉండవని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.
తనపై ఎన్ని కుట్రలు జరిగినా తను మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతానని, తనను ఎవ్వరూ అడ్డుకోలేరని అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇన్ని మాటలు చెప్పిన ఈ హీరో, తన సినిమాను అడ్డుకున్న ఆ గ్రూపులు ఏంటనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.