ఒలింపిక్ టెస్ట్ హాకీలో భారతజట్ల బోణీ
మహిళల విభాగంలో జపాన్ పై 2-1తో గెలుపు పురుషుల విభాగంలో 6-0తో మలేసియాపై విజయం 2020 ఒలింపిక్స్ వేదిక టోక్యోలో ప్రారంభమైన ఒలింపిక్స్ టెస్ట్ హాకీ టోర్నీ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు తొలివిజయాలతో శుభారంభం చేశాయి. మహిళల ప్రారంభరౌండ్ మ్యాచ్ లో ఆతిథ్య జపాన్ ను భారత్ 2-1 గోల్స్ తో అధిగమించింది. ఒలింపిక్స్ హాకీ తాజా నిబంధనల ప్రకారం…రెండుజట్లూ.. 16 మంది ప్లేయర్లతోనే తలపడ్డాయి. ఆట మొదటి భాగం9వ నిముషంలోనే భారత్ కు పెనాల్టీ కార్నర్ ద్వారా […]
- మహిళల విభాగంలో జపాన్ పై 2-1తో గెలుపు
- పురుషుల విభాగంలో 6-0తో మలేసియాపై విజయం
2020 ఒలింపిక్స్ వేదిక టోక్యోలో ప్రారంభమైన ఒలింపిక్స్ టెస్ట్ హాకీ టోర్నీ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు తొలివిజయాలతో శుభారంభం చేశాయి.
మహిళల ప్రారంభరౌండ్ మ్యాచ్ లో ఆతిథ్య జపాన్ ను భారత్ 2-1 గోల్స్ తో అధిగమించింది. ఒలింపిక్స్ హాకీ తాజా నిబంధనల ప్రకారం…రెండుజట్లూ.. 16 మంది ప్లేయర్లతోనే తలపడ్డాయి.
ఆట మొదటి భాగం9వ నిముషంలోనే భారత్ కు పెనాల్టీ కార్నర్ ద్వారా గుర్జీత్ కౌర్ తొలిగోల్ అందించింది. అయితే ఆ తర్వాత ఈక్వలైజర్ కోసం పోరాడిన జపాన్ కు.. 16వ నిముషంలో మిత్సుహషీ ఫీల్డ్ గోల్ తో ఊపిరిపీల్చుకొంది.
రెండుజట్లు 1-1తో సమఉజ్జీగా నిలవడంతో పోటీ మరింత పట్టుగా సాగింది. ఆట 35 వ నిముషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ను సైతం గుర్జీత్ కౌర్ గోల్ గా మార్చి 2-1 గోల్స్ తో భారత విజయం పూర్తి చేసింది.
భారత మహిళల జట్టు మిగిలిన రెండురౌండ్లలోనూ 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా, 11వ ర్యాంకర్ చైనా జట్లతో తలపడాల్సి ఉంది.
మలేసియాపై భారత్ జోరు…
పురుషుల తొలిరౌండ్ మ్యాచ్ లో భారత్ 6-0 గోల్స్ తో మలేసియాను చిత్తు చేసింది. భారత్ కు మలేసియా ఏదశలోనూ సరిజోడీ కాలేకపోయింది.