Telugu Global
National

ఆర్మీలో ముగిసిన ధోనీ డ్యూటీ

న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన మహీ భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ.. రెండు వారాల తన సైనిక విధులను విజయవంతంగా నిర్వర్తించి.. కాశ్మీర్ లోయ నుంచి న్యూఢిల్లీకి తిరిగి వచ్చాడు. భారత ప్రాదేశిక దళాలకు చెందిన 106 టీఏ బెటాలియన్ ప్యారాచ్యూట్ వింగ్ లో గౌరవ లెఫ్ట్ నెంట్ కర్నల్ గా ఉన్న ధోనీ.. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే.. సైనికుడిగా దేశసేవ చేయాలని నిర్ణయించుకొన్నాడు. అనుమతి కోరిన వెంటనే ధోనీకి కొద్దిరోజులపాటు శిక్షణతో పాటు అవగాహన […]

ఆర్మీలో ముగిసిన ధోనీ డ్యూటీ
X
  • న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన మహీ

భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ.. రెండు వారాల తన సైనిక విధులను విజయవంతంగా నిర్వర్తించి.. కాశ్మీర్ లోయ నుంచి న్యూఢిల్లీకి తిరిగి వచ్చాడు.

భారత ప్రాదేశిక దళాలకు చెందిన 106 టీఏ బెటాలియన్ ప్యారాచ్యూట్ వింగ్ లో గౌరవ లెఫ్ట్ నెంట్ కర్నల్ గా ఉన్న ధోనీ.. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే.. సైనికుడిగా దేశసేవ చేయాలని నిర్ణయించుకొన్నాడు.

అనుమతి కోరిన వెంటనే ధోనీకి కొద్దిరోజులపాటు శిక్షణతో పాటు అవగాహన కల్పించి.. .కాశ్మీర్ లోయలో విధులు కేటాయించారు. గస్తీ విధులతో పాటు గార్డుగాను ధోనీ సేవలు అందించిన తర్వాత లడాక్ లో వారం రోజులపాటు గడిపి వచ్చాడు.

సైనిక సోదరుల హ్యాపీ…

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహేంద్రసింగ్ ధోనీ తమతో కలసి… తమలో ఒక్కడిగా ఉంటూ విధులు నిర్వర్తించడాన్ని 106 బెటాలియన్ సైనిక సోదరులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.

శ్రీనగర్ నుంచి లడాక్ చేరిన సమయంలో ధోనీకి అక్కడి సైనికులు ఘనస్వాగతం పలికారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో సైతం ధోనీ పాల్గొన్నాడు.

అంతేకాదు… సైనికదళ సభ్యులతో కలసి వాలీబాల్ ఆడిన ఫోటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు. లే నగరంలోని ఓ బాస్కెట్ బాల్ కోర్టును.. క్రికెట్ ఫీల్డ్ గా మార్చి అక్కడి పిల్లలతో కలసి ధోనీ క్రికెట్ ఆడాడు.

సైనికదళంలో రెండువారాల సేవ ముగియడంతో ధోనీ..న్యూఢిల్లీకి తిరిగి వచ్చాడు. భార్యసాక్షి, కూతురు జీవా ఘనస్వాగతం పలికారు.

ఇక టీ-20ల వైపు ధోనీ చూపు…

సెప్టెంబర్ 15 నుంచి సౌతాఫ్రికాతో జరిగే టీ-20 సిరీస్ లో..మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి పాల్గొనే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ లో ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత..సైనికవిధుల్లో చేరిన ధోనీ వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

First Published:  18 Aug 2019 5:37 AM GMT
Next Story