Telugu Global
NEWS

బీజేపీలో చేర‌బోయే నేత‌లు వీళ్లే ! 

బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో భారీగా చేరిక‌లు ఉండేలా క‌మ‌ల‌నాథులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ తెలుగుదేశం నేతలతో మంత‌నాలు జ‌రిపారు. సీనియ‌ర్ నేతలు దేవేంద‌ర్ గౌడ్‌, ఆయ‌న కుమారుడు వీరేంద‌ర్‌గౌడ్‌తో పాటు రేవూరి ప్ర‌కాష్‌రెడ్డి, గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు లాంటి నేత‌లతో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే ప్ర‌స్తుతానికి వారి చేరిక‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. త్వ‌ర‌లోనే ఈ నేత‌లంతా ఢిల్లీకి వెళ్లి  అమిత్ షా స‌మ‌క్షంలో చేర‌తార‌ని ఊహ‌గానాలు విన్పిస్తున్నాయి. […]

బీజేపీలో చేర‌బోయే నేత‌లు వీళ్లే ! 
X

బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో భారీగా చేరిక‌లు ఉండేలా క‌మ‌ల‌నాథులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ తెలుగుదేశం నేతలతో మంత‌నాలు జ‌రిపారు.

సీనియ‌ర్ నేతలు దేవేంద‌ర్ గౌడ్‌, ఆయ‌న కుమారుడు వీరేంద‌ర్‌గౌడ్‌తో పాటు రేవూరి ప్ర‌కాష్‌రెడ్డి, గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు లాంటి నేత‌లతో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే ప్ర‌స్తుతానికి వారి చేరిక‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

త్వ‌ర‌లోనే ఈ నేత‌లంతా ఢిల్లీకి వెళ్లి అమిత్ షా స‌మ‌క్షంలో చేర‌తార‌ని ఊహ‌గానాలు విన్పిస్తున్నాయి. అయితే రాజ్య‌స‌భ స‌భ్యుడు గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు ఇప్ప‌టికే బీజేపీలో చేరారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ కాషాయ కండువా క‌ప్పుకోలేదు. ఆయ‌న న‌డ్డా స‌మ‌క్షంలో బీజేపీ కండువా క‌ప్పుకుంటారు. ఈయ‌న‌తో పాటు పార్టీలో చేరే నేతల లిస్ట్ ఇదే.

  • శోభారాణి …తెలుగు మహిళ అధ్యక్షురాలు
  • దీపక్ రెడ్డి ..టీడీపీ జనరల్ సెక్రెటరీ
  • ఈగ మల్లేశం… వరంగల్ రూరల్ అధ్యక్షుడు
  • రజనీ కుమారి ..తుంగతుర్తి ఇంచార్జి
  • పోరిక జగన్ నాయక్..మాజీ మంత్రి
  • ఎర్ర శేఖర్ ..మాజీ ఎమ్మెల్యే
  • మోవ్వా సత్యనారాయణ.. శేరిలింగంపల్లి అసెంబ్లీ
  • ముజఫర్… మలక్ పేట్ టీడీపీ ఇంచార్జ్
  • పుల్లారావు యాదవ్..ఓయూ జేఏసి
  • సామ రంగారెడ్డి ..రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
  • కోనేరు చిన్ని…కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు
  • శ్రీకాంత్ గౌడ్ …పఠాన్ చెరు ఇంచార్జి
  • బోట్ల శ్రీనివాస్…జనగామ జిల్లా అధ్యక్షుడు
  • రాజవర్ధన్ రెడ్డి ..వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత
  • శ్రీనివాస్ గౌడ్ …నల్గొండ ఇంచార్జ్
  • అంజయ్య యాదవ్ …నాగార్జున సాగర్ అసెంబ్లీ ఇంచార్జి
  • సాధినేని శ్రీనివాస్ ..మిర్యాలగూడ అసెంబ్లీ ఇంచార్జి
  • శ్రీకళారెడ్డి ….కోదాడ నేత
  • ఓం ప్రకాష్…మాజీ తెలుగు విద్యార్థి నేత
  • బాబు నాయక్… టీడీపీ ఎస్టీ సెల్
  • నరోత్తం రెడ్డి… టీఆర్ఎస్ నేత
  • పాశం శ్రీధర్… శంషాబాద్ టీఆర్ఎస్ నేత
  • విజయ్ పాల్ రెడ్డి… మాజీ ఎమ్మెల్యే నారాయణ ఖేడ్
  • ఉపేందర్ …కాంగ్రెస్ నేత
  • శ్యామ్ సుందర్… మంచిర్యాల టీడీపీ అధ్యక్షులు
  • రఘునాథ్ రెడ్డి…. భూపాల పల్లి జిల్లా అధ్యక్షుడు
  • రామ్ రెడ్డి…. సూర్యపేట ఇంచార్జ్
First Published:  18 Aug 2019 1:54 AM IST
Next Story