Telugu Global
NEWS

నల్లమలలో అడుగు పెడితే గుండెల్లో గునపాలు దించుతాం

నల్లమలలో యురేనియం తవ్వకాలకు ఎవరైనా వస్తే వారి గుండెల్లో గునపాలు దించుతామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. యురేనియం తవ్వకాలకు ఎవరు వచ్చినా…. మహిళలంతా తిరగబడి, కళ్లలో కారం కొట్టి తరిమేయాలన్నారు. చస్తే బొంద పెట్టడానికి కేసీఆర్‌కు ఫాంహౌజ్ ఉంది… మోడీకి ఇంకో చోటు ఉందని.. కానీ అడవి బిడ్డలకు మరోచోట ఆశ్రయం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇలాంటి అడవి బిడ్డల జీవితాలను నాశనం చేసేందుకే… యురేనియం తవ్వకాలకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ […]

నల్లమలలో అడుగు పెడితే గుండెల్లో గునపాలు దించుతాం
X

నల్లమలలో యురేనియం తవ్వకాలకు ఎవరైనా వస్తే వారి గుండెల్లో గునపాలు దించుతామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

యురేనియం తవ్వకాలకు ఎవరు వచ్చినా…. మహిళలంతా తిరగబడి, కళ్లలో కారం కొట్టి తరిమేయాలన్నారు. చస్తే బొంద పెట్టడానికి కేసీఆర్‌కు ఫాంహౌజ్ ఉంది… మోడీకి ఇంకో చోటు ఉందని.. కానీ అడవి బిడ్డలకు మరోచోట ఆశ్రయం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇలాంటి అడవి బిడ్డల జీవితాలను నాశనం చేసేందుకే… యురేనియం తవ్వకాలకు పూనుకుంటున్నారని మండిపడ్డారు.

నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి… కరెంట్‌ కోసం ఖనిజం తవ్వుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఇప్పటికే దేశంలో అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి ఉందన్నారు. కేవలం నల్లమలలో ఖనిజ సంపదను దోచుకునేందుకు యురేనియం తవ్వకాలకు వస్తున్నారన్నారు.

నల్లమలలో యురేనియం తవ్వుతామని ఏ అధికారి గానీ వస్తే దొరికినోడిని దొరికినట్టు పట్టుకుని చెట్లకు కట్టేయాలని పిలుపునిచ్చారు.

ఆదుకోవడానికి ఎవడో దిగిరాడని… మనమందరం కలిసి పోరాటం చేద్దామన్నారు. మనందరం కలిసి ఉంటే ఏ మొగోడు వచ్చి ఖనిజం తీసుకెళ్తాడో చూద్దామని వ్యాఖ్యానించారు.

ఎవడొచ్చినా సరే నల్లమలలో బొందపెడదామని…. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వచ్చేవారి గుండెల్లో గునపం దింపుతామని హెచ్చరించారు. అధికారులకు ఇదే తామిచ్చే హెచ్చరిక అన్నారు.

తమ జీవితాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. నల్లమల బిడ్డలకు తాను అండగా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే యురేనియం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ప్రజలు ఏమైపోయారో చూస్తే ఈ తవ్వకాల వల్ల జరిగే ప్రమాదం ఏంటో అర్థమవుతుందన్నారు.

ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలను అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. నల్లమల గ్రామాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను గ్రామాల నుంచి తరిమేయాలని, గ్రామ బహిష్కరణ చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

First Published:  17 Aug 2019 11:15 AM IST
Next Story