ముందస్తు అణుదాడికి భారత్ సై...
అణు బాంబుల ప్రయోగంపై భారత్ వైఖరి మారుతోంది. ఇప్పటి వరకు తొలుత తాము అణుదాడి చేయం అన్నది భారత్ సిద్ధాంతం. అవతలి వారు దాడి చేస్తే అప్పుడు మాత్రమే తాము అణుదాడి చేస్తాం… ముందుగానే తమ వైపు నుంచి అణుబాంబు ప్రయోగాలు ఉండవన్న విధానానికి ఇంతకాలం భారత్ కట్టుబడి ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన వైఖరిని సవరించుకుంటోంది. ఇందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా ఉన్నాయి. అణ్వస్త్రాలను […]
అణు బాంబుల ప్రయోగంపై భారత్ వైఖరి మారుతోంది. ఇప్పటి వరకు తొలుత తాము అణుదాడి చేయం అన్నది భారత్ సిద్ధాంతం. అవతలి వారు దాడి చేస్తే అప్పుడు మాత్రమే తాము అణుదాడి చేస్తాం… ముందుగానే తమ వైపు నుంచి అణుబాంబు ప్రయోగాలు ఉండవన్న విధానానికి ఇంతకాలం భారత్ కట్టుబడి ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన వైఖరిని సవరించుకుంటోంది.
ఇందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా ఉన్నాయి. అణ్వస్త్రాలను తొలుత వాడబోం అన్న సిద్ధాంతానికి ఇంతకాలం కట్టుబడి ఉన్నామని… అవసరమైతే ఆ వైఖరిని పక్కనపెట్టేందుకు కూడా సిద్దమని రాజ్‌నాథ్ దాదాపు తేల్చిచెప్పారు.
”అణువిధానంపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది అప్పటి పరిస్థితులను బట్టే ఆధారపడి ఉంటుంది” అని స్పష్టం చేశారు. భారత్ రెండుసార్లు అణుపరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్ వేదికగా రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను పాకిస్థాన్‌కు ఒక హెచ్చరికగా భావిస్తున్నారు. అవసరమైతే పాక్ దాడి చేయడాని కంటే ముందే దాడికి భారత్ వెనుకాడబోదని రక్షణ మంత్రి స్పష్టం చేసినట్టు అయింది.