Telugu Global
NEWS

నెర‌వేరిన వైఎస్ క‌ల !

15 సంవత్సరాల కల నెరవేరింది. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిసామర్ధ్యం 44,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2004 లో దివంగ‌త నేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 11,000 క్యూసెక్కుల సామర్ధ్యమున్న పోతిరెడ్డిపాడులో రెండవ రెగ్యులేటర్ కట్టారు. పోతిరెడ్డిపాడు సామ‌ర్ధ్యాన్ని44,000 క్యూసెక్కులకు పెంచారు. ఆరోజు సామ‌ర్ధ్యం పెంచ‌డం వ‌ల్ల ఈరోజు పోతిరెడ్డి పాడు నుంచి భారీగా నీటిని విడుద‌ల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిలో తెలుగు గంగ కు 17,000 క్యుసెక్కులు, నిప్పుల వాగు […]

నెర‌వేరిన వైఎస్ క‌ల !
X

15 సంవత్సరాల కల నెరవేరింది. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిసామర్ధ్యం 44,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2004 లో దివంగ‌త నేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 11,000 క్యూసెక్కుల సామర్ధ్యమున్న పోతిరెడ్డిపాడులో రెండవ రెగ్యులేటర్ కట్టారు. పోతిరెడ్డిపాడు సామ‌ర్ధ్యాన్ని44,000 క్యూసెక్కులకు పెంచారు.

ఆరోజు సామ‌ర్ధ్యం పెంచ‌డం వ‌ల్ల ఈరోజు పోతిరెడ్డి పాడు నుంచి భారీగా నీటిని విడుద‌ల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిలో తెలుగు గంగ కు 17,000 క్యుసెక్కులు, నిప్పుల వాగు ఎస్కేప్ చానల్ కు 13,000 క్యుసెక్కుల నీరు విదుదలచేస్తున్నారు.ప్రతి కాలువలో సంమృద్ధిగా నీళ్ళు వున్నాయి. అటు హంద్రి-నీవా కూడ పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తుంది.

కృష్ణాన‌ది వ‌ర‌ద స‌మ‌యంలో 30 రోజుల్లో 114 టీఎంసీల నీటిని త‌రలించాల‌ని వైఎస్ హ‌యాంలో ప‌నులు చేప‌ట్టారు. ఇందులో తెలుగు గంగ కాలువకు 29 టీఎంసీలు, ఎస్ఆర్‌సికి 19 టీఎంసీలు, గాలేరు న‌గ‌రికి 38 టీఎంసీలు, చెన్నై న‌గ‌రం తాగునీటికి 15 టీఎంసీలు, రాయలసీమ తాగునీటి అవ‌స‌రాల కోసం మిగ‌తా నీళ్ల‌ను ఉప‌యోగించాల‌ని అప్పట్లో నిర్ణ‌యించారు.

ఇందుకు అనుగుణంగా 2006లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పోతిరెడ్డి పాడు నీటి విడుద‌ల సామ‌ర్ధ్యాన్ని 11000 క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల‌కు పెంచే ప‌నులు ప్రారంభించారు. ఇందు కోసం 20వేల కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేట‌ర్ ద‌గ్గ‌ర ప‌ది గేట్లు ఏర్పాటు చేశారు.

ఈ ప‌నులు 2008లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే ప‌నుల్లో జాప్యం కార‌ణంగా 2012లో పూర్తి చేశారు. అయితే ఆ త‌ర్వాత కాలువ‌ ప‌నులు పూర్తి కావడంతో ఈ సారి44 వేల క్యూసెక్కుల నీటి త‌ర‌లింపు సాధ్య‌మైంది.

2004లో పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని నిరసిస్తూ దేవినేని ఉమా నాయకత్వంలో ప్రకాశం బ్యారేజి వద్ద టెంట్లు వేసి మూడు రోజులపాటు ధర్నా చేశారు. ఒక్క బక్కెట్ నీళ్ళను తీసుకెళ్ళినా రక్తం చిందిస్తాం అని దేవినేని ఉమా హెచ్చరిక చేశారు.

మొన్నటివరకు నీటిపారుదల మంత్రిగా పనిచేసిన ఈ దేవినేని ఉమానే రాయలసీమకు 100 టీఎంసీల నీటిని ఇచ్చాం, కడపకు నీళ్ళు ఇచ్చాం, పులివెందులకు నీళ్ళు ఇచ్చాం అని గత 5 సంవత్సరాలు హంగామా చేశారు.

పోతిరెడ్డిపాడు డిస్‌చార్జ్‌ కెపాసిటీని 44,000 క్యుసెక్కులకు పెంచకుండా ఉండివుంటే గండికోట లేదు, పైడిపాలెం లేదు, అసలు సీమకు సరిపడ నీళ్ళే దక్కేవి కాదు. వైఎస్ పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచకపోయి ఉంటే బాబుగారి కరకట్ట ఇళ్ళు వొరద వొచ్చిన రెండవరోజే మునిగిపోయేవని నిపుణులు అంటున్నారు.

First Published:  17 Aug 2019 6:19 AM IST
Next Story