రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ
పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ జరగకుండా ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ప్రభుత్వం. 4వేల 900 కోట్లతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్‌వర్క్స్ పనులకు 1800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు 3వేల 100 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. టెండర్ నోటిఫికేషన్‌ను జలవనరుల శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. పోలవరం రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తాము […]
పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ జరగకుండా ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ప్రభుత్వం.
4వేల 900 కోట్లతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్‌వర్క్స్ పనులకు 1800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు 3వేల 100 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.
టెండర్ నోటిఫికేషన్‌ను జలవనరుల శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. పోలవరం రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తాము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామంటూ పోలవరం ప్రాజెక్టు ఆథారిటి సీఈవో లేఖ రాసినప్పటికీ రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకే అడుగు వేసింది. 14 రోజుల్లోగా టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రైస్ బిడ్‌లను ఓపెన్ చేసి ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు.
బిడ్‌లో తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్ట్ సంస్థ పేరును నేరుగా వెల్లడించరు. ప్రైస్ బిడ్‌ను తెరిచిన తర్వాత కోట్ అయిన తక్కువ ధరను మాత్రమే వెల్లడిస్తారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పక్రియ మొదలవుతుంది. బిడ్‌కు అర్హత సాధించిన కంపెనీలన్నీ రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనవచ్చు. ప్రైస్ బిడ్‌లో కోట్ చేసిన దాని కంటే తక్కువ ధరకే పని చేసేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చు.
ఈ పక్రియ కోసం 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఎవరైనా ముందుకొచ్చి తక్కువ ధరకు కోట్ చేస్తే… మరో 15 నిమిషాలు కేటాయించి మరోసారి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు.
అలా వీలైనంత తక్కువ ధరకు కోట్ అయిన తర్వాత, ఇక ఎవరూ అంతకంటే తక్కువ ధరకు పనిచేసేందుకు ముందుకు రాని పక్షంలో అప్పుడు పనులు దక్కించుకున్న సంస్థ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. 14 రోజుల్లో కొత్త సంస్థతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది.