Telugu Global
International

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తన మిత్రుడు చైనా సాయంతో చేసిన పన్నాగం బెడిసికొట్టింది. పాకిస్థాన్‌ తరపున ప్రత్యేకంగా చైనా లాబీయింగ్ చేయకపోయినా… భద్రతామండలిలో తనకున్న శాశ్వత సభ్యత్వ హోదాతో ఈ అంశాన్ని భద్రతామండలి సమావేశం దాకా తీసుకెళ్లగలిగింది. శుక్రవారం రాత్రి 7.30 నుంచి గంటన్నర పాటు సభ్యదేశాలు ఈ అంశంపై చర్చించాయి. భారత్, పాక్‌లు మాత్రం ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. చర్చ సందర్భంగా పాక్‌కు ఏ దేశం […]

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ
X

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తన మిత్రుడు చైనా సాయంతో చేసిన పన్నాగం బెడిసికొట్టింది.

పాకిస్థాన్‌ తరపున ప్రత్యేకంగా చైనా లాబీయింగ్ చేయకపోయినా… భద్రతామండలిలో తనకున్న శాశ్వత సభ్యత్వ హోదాతో ఈ అంశాన్ని భద్రతామండలి సమావేశం దాకా తీసుకెళ్లగలిగింది.

శుక్రవారం రాత్రి 7.30 నుంచి గంటన్నర పాటు సభ్యదేశాలు ఈ అంశంపై చర్చించాయి. భారత్, పాక్‌లు మాత్రం ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. చర్చ సందర్భంగా పాక్‌కు ఏ దేశం కూడా మద్దతు పలకలేదు. కశ్మీర్ రెండు దేశాల మధ్య వివాదం కాబట్టి వారే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని రష్యా తేల్చిచెప్పింది.

భారత్‌కు రష్యా పూర్తి బాసటగా నిలిచింది. కేవలం కశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మాత్రమే ఈ సమావేశమని… కశ్మీర్ అంశాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని రష్యా స్పష్టం చేసింది. సమావేశానికి ముందు ట్రంప్ తో ఇమ్రాన్ ఖాన్ ఫోన్ లో మాట్లాడారు. అయినప్పటికీ అమెరికా తటస్థ వైఖరిని తీసుకుంది.

ఫ్రాన్స్, బ్రిటన్ కూడా పాక్‌ వాదనతో అంగీకరించలేదు. కశ్మీర్ అంశం ద్వైపాక్షికంగానే తేల్చుకోవాలని భద్రతామండలి తాత్కాలిక సభ్య దేశాలు కూడా స్పష్టం చేశాయి. దీంతో చైనా కూడా ఒంటరైపోయింది. పాకిస్థాన్‌ను బహిరంగంగా సమర్ధించలేక మౌనంగా ఉండిపోయింది.

అయితే కశ్మీర్ అంశంపై భద్రతామండలిలో తక్షణం చర్చ జరిగేలా చేయగలిగామని అది తమ విజయమని పాకిస్థాన్‌ చెప్పుకుని సరిపెట్టుకుంది.

First Published:  17 Aug 2019 2:10 AM IST
Next Story