Telugu Global
National

బీజేపీ తీర్ధం ఎవరికో.... రేపు తేలుతుంది

ఆగస్టు 18.. అంటే రేపు.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఇక తెలంగాణ టీడీపీని దాదాపు బీజేపీలో విలీనం చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. చాలా మంది కమలం గూటికి చేరడానికి రెడీ అయ్యారని సమాచారం. బీజేపీలోకి టీడీపీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి దేవందర్ గౌడ్ తోపాటు ఆయన కుమారుడు.. చాలామంది టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారట.. తెలంగాణలో కాడి వదిలేసిన చంద్రబాబు […]

బీజేపీ తీర్ధం ఎవరికో.... రేపు తేలుతుంది
X

ఆగస్టు 18.. అంటే రేపు.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఇక తెలంగాణ టీడీపీని దాదాపు బీజేపీలో విలీనం చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. చాలా మంది కమలం గూటికి చేరడానికి రెడీ అయ్యారని సమాచారం.

బీజేపీలోకి టీడీపీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి దేవందర్ గౌడ్ తోపాటు ఆయన కుమారుడు.. చాలామంది టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారట.. తెలంగాణలో కాడి వదిలేసిన చంద్రబాబు సైతం నేతలందరినీ బీజేపీ గూటికి పంపడానికి మానసికంగా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే జేపీ నడ్డా పర్యటనలో టీడీపీ నేతలే కాదు.. కొందరు టీఆర్ఎస్ అసంతృప్తులను కూడా బీజేపీలో చేర్చుకోవడానికి సంప్రదింపులు పూర్తయ్యాయని తాజా టాక్. టీఆర్ఎస్ ను నమ్మి మోసపోయి అసంతృప్తిగా ఉన్న నేతలు, ఇక పదవులు వచ్చే అవకాశం లేని టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేర్చుకోవడానికి కమలదళం రెడీ అయినట్టు సమాచారం.

కాగా బీజేపీలోకి టీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అధిష్టానం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. తెలంగాణలో అధికారంలో ఉండడంతో సామధాన బేధ దండోపాయాలతోపాటు బుజ్జగింపులతో వారిని బీజేపీలోకి చేరకుండా నిలువరించే ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీలోకి టీఆర్ఎస్ నేతలు వెళితే పార్టీ ప్రతిష్ట పరువు దెబ్బతినే అవకాశాలున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరి ఆగస్టు 18న తెలంగాణ వేదికగా ఏం జరగబోతుంది.? రాజకీయంగా ఎటువంటి సంచలనం రేగుతుందో చూడాలి మరీ..

First Published:  17 Aug 2019 6:21 AM IST
Next Story