తెలంగాణ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా వినోద్
లోక్ సభ మాజీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. గత ఎన్నికలలో కరీంనగర్ నుంచి పోటీ చేసిన వినోద్ కుమార్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్ కు తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్ష పదవిని ఇస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర్రం ప్రగతి పథంలో నడిచేందుకు వినోద్ కుమార్ […]
లోక్ సభ మాజీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. గత ఎన్నికలలో కరీంనగర్ నుంచి పోటీ చేసిన వినోద్ కుమార్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్ కు తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్ష పదవిని ఇస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర్రం ప్రగతి పథంలో నడిచేందుకు వినోద్ కుమార్ వంటి సీనియర్ నాయకుల మార్గనిర్దేశం అవసరమని భావించిన ప్రభుత్వం ఆయనకు ఈ పదవి ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.