Telugu Global
NEWS

నీ కొంప ఏనాడో మునిగింది బాబు.... ఇప్పుడేంది ముంచేది....

ప్రజలంతా నది వద్దకు వెళ్లి కృష్ణమ్మ పరవళ్లు చూసి సంబరపడుతుంటే… చంద్రబాబు మాత్రం కడుపు మంటతో మండిపోతున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కృష్ణా నది ప్రవాహం పైనా చంద్రబాబు కోపంగా ఉన్నారన్నారు. తనకు హైసెక్యూరిటీ ఉండాలంటున్న చంద్రబాబు మరి వరద ముంపు పొంచి ఉన్న ఇంటిని ఎందుకు నివాసంగా మార్చుకున్నారని ప్రశ్నించారు. తాను ఉంటున్నది అక్రమ నివాసం అని తెలిసినా చంద్రబాబు ఎందుకు ఖాళీ చేసేందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడంలో […]

నీ కొంప ఏనాడో మునిగింది బాబు.... ఇప్పుడేంది ముంచేది....
X

ప్రజలంతా నది వద్దకు వెళ్లి కృష్ణమ్మ పరవళ్లు చూసి సంబరపడుతుంటే… చంద్రబాబు మాత్రం కడుపు మంటతో మండిపోతున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

కృష్ణా నది ప్రవాహం పైనా చంద్రబాబు కోపంగా ఉన్నారన్నారు. తనకు హైసెక్యూరిటీ ఉండాలంటున్న చంద్రబాబు మరి వరద ముంపు పొంచి ఉన్న ఇంటిని ఎందుకు నివాసంగా మార్చుకున్నారని ప్రశ్నించారు.

తాను ఉంటున్నది అక్రమ నివాసం అని తెలిసినా చంద్రబాబు ఎందుకు ఖాళీ చేసేందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడంలో ఉండడమే కాకుండా దాన్ని ముంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ నీచమైన ప్రచారానికి చంద్రబాబు దిగజారిపోవడం దురదృష్టకరమన్నారు.

చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం ఉన్నా… అహంకారంతో వ్యవహరిస్తూ అక్రమ కొంపను పట్టుకుని వేలాడుతున్నారన్నారు. వరద వస్తోందని అప్రమత్తం చేసేందుకు వెళ్లిన వీఆర్‌వోను కూడా లోనికి రానివ్వకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

కరకట్ట వెంబడి ఉన్న నివాసాలకు ఎప్పటికైనా ముప్పు తప్పదని… ప్రకృతిని గౌరవించి వెంటనే ఖాళీ చేయాలన్నారు. ప్రకృతికి ఎదురెళ్లే ప్రయత్నం చేయవద్దన్నారు. అమరావతి గురించి మాట్లాడే చంద్రబాబు ఐదేళ్లలో అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదని నిలదీశారు.

చంద్రబాబు ఇంటిని ముంచడానికే వరదను సృష్టిస్తున్నారని మాట్లాడడానికి దేవినేని ఉమకు బుద్దుందా అని నిలదీశారు. చంద్రబాబు ఇంటి కోసం ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, సాగర్‌ ఇలా అన్ని గేట్లను ఎత్తుకుంటూ వచ్చామా అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కొంప రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయిందని.. ఇప్పుడు పనిగట్టుకుని చంద్రబాబు నివాసాన్ని నీటిలో ముంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు.

తక్షణం చంద్రబాబు ఇంటి సిబ్బంది కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని…. లేకుంటే వరద వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉందని సూచించారు.

చంద్రబాబు క్షేమం కోరే…. తాము చెబుతున్నామని, ఇంటిని ఖాళీ చేయాలన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో నివాసం కల్పించాలని కోరితే ప్రభుత్వం దాన్ని పరిశీలించేందుకు సిద్ధంగా ఉందన్నారు అంబటి రాంబాబు.

First Published:  17 Aug 2019 2:42 AM GMT
Next Story