భారత మాజీ క్రికెటర్ ఆత్మహత్య
ఫ్యానుకు ఉరివేసుకొని వీబీ చంద్రశేఖర్ మృతి భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ కామెంటీటర్ వీబీ చంద్రశేఖర్ ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకొన్నారు. మైలాపూర్ లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. దేశవాళీ క్రికెట్లో తమిళనాడుకు, వన్డే క్రికెట్లో భారత్ కు ఆడిన 57 ఏళ్ల వీబీ చంద్రశేఖర్ కు దూకుడుగా ఆడే ఓపెనర్ గా గుర్తింపు ఉంది. కృష్ణమాచారీ శ్రీకాంత్ తో కలిసి తమిళనాడు జట్టుకు ఓపెనర్ గా పలు చిరస్మరణీయ […]

- ఫ్యానుకు ఉరివేసుకొని వీబీ చంద్రశేఖర్ మృతి
భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ కామెంటీటర్ వీబీ చంద్రశేఖర్ ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకొన్నారు. మైలాపూర్ లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు.
దేశవాళీ క్రికెట్లో తమిళనాడుకు, వన్డే క్రికెట్లో భారత్ కు ఆడిన 57 ఏళ్ల వీబీ చంద్రశేఖర్ కు దూకుడుగా ఆడే ఓపెనర్ గా గుర్తింపు ఉంది.
కృష్ణమాచారీ శ్రీకాంత్ తో కలిసి తమిళనాడు జట్టుకు ఓపెనర్ గా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన వీబీ..భారత వన్డే జట్టులో సభ్యుడిగా ఏడు వన్డేలలో పాల్గొన్నాడు.
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత… ఇండియా సిమెంట్స్ లో ఉద్యోగిగా ఉంటూనే వివిధ రూపాలలో క్రికెట్ తో తన అనుబంధం కొనసాగించారు.
క్రికెట్ వ్యాపారంతో నష్టాలు…
రిటైర్మెంట్ అనంతరం జాతీయ సెలెక్టర్ గా, తమిళనాడు క్రికెట్ జట్టు శిక్షకుడిగా…బీసీసీఐ కామెంటీటర్ గా పనిచేసిన వీబీ…ఆ తర్వాత…వివిధ రూపాలలో క్రికెట్ వ్యాపారంలో అడుగుపెట్టారు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో కంచీ ఫ్రాంచైజీ ఓనర్ గా వీబీ కంచీ వీరన్స్ జట్టును నడిపించారు. అంతేకాదు వీబీ నెస్ట్ పేరుతో వెలాచేరీలో ఓ క్రికెట్ అకాడమీని సైతం నిర్వహిస్తూ వచ్చారు.
అయితే… తమిళనాడు ప్రీమియర్ లీగ్, క్రికెట్ అకాడమీల నిర్వహణతో భారీగా నష్టపోయారు. ఆర్థికంగా కృంగిపోయిన వీబీ.. డిప్రెషనలోకి వెళ్లినట్లు కుటుంబసభ్యుల చెబుతున్నారు.
తన బెడ్ రూమ్ లోని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు అధికారి మురుగన్ ప్రకటించారు.
చక్కటి వ్యక్తిగా, పేరున్న క్రికెట్ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందిన వీబీ మృతి పట్ల పలువురు మాజీ క్రికెటర్లు, తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.