Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్ అంపైరింగ్ లో అలీంధర్ రికార్డు

లార్డ్స్ టెస్టుతో బక్నర్ ప్రపంచ రికార్డు సమం ఐసీసీ ప్యానెల్ లో పాకిస్థాన్ సీనియర్ అంపైర్ అలీం ధర్… కరీబియన్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ అంపైర్ స్టీవ్ బక్నర్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. 2019 ఆస్ట్ర్లేలియా- ఇంగ్లండ్ జట్ల యాషెస్ సిరీస్ లోని రెండోటెస్ట్ మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా అలీం ధర్.. తన కెరియర్ లో 128 టెస్టులు పూర్తి చేయగలిగాడు. 2003 లో […]

టెస్ట్ క్రికెట్ అంపైరింగ్ లో అలీంధర్ రికార్డు
X
  • లార్డ్స్ టెస్టుతో బక్నర్ ప్రపంచ రికార్డు సమం

ఐసీసీ ప్యానెల్ లో పాకిస్థాన్ సీనియర్ అంపైర్ అలీం ధర్… కరీబియన్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ అంపైర్ స్టీవ్ బక్నర్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు.

2019 ఆస్ట్ర్లేలియా- ఇంగ్లండ్ జట్ల యాషెస్ సిరీస్ లోని రెండోటెస్ట్ మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా అలీం ధర్.. తన కెరియర్ లో 128 టెస్టులు పూర్తి చేయగలిగాడు.

2003 లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అంపైర్ గా వ్యవహరించడం ద్వారా తన కెరియర్ ప్రారంభించిన 51 ఏళ్ల అలీం ధర్ గత 16 సంవత్సరాల కాలంలో మొత్తం 128 టెస్టుల్లో బాధ్యతలు నిర్వర్తించాడు.

అంపైరింగ్ లో తన ఆరాధ్య దైవం, కరీబియన్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ అంపైర్ స్టీవ్ బక్నర్ పేరుతో ఉన్న 128 టెస్టుల రికార్డును అలీం ధర్ సమం చేయడం ద్వారా సంయుక్త ప్రపంచ రికార్డు హోల్డర్ గా నిలిచాడు.

మొత్తం మూడు ఫార్మాట్లలో కలసి అలీంధర్ కు 376 మ్యాచ్ ల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించిన అసాధారణ రికార్డు ఉంది.

First Published:  16 Aug 2019 6:26 AM IST
Next Story