పోలవరం రివర్స్ టెండరింగ్ జరిగేది ఇలా...
పోలవరం రివర్స్ టెండరింగ్‌కు రంగం సిద్ధమైంది. రివర్స్ టెండరింగ్ వల్ల ఆలస్యం అవుతుంది… వ్యయం పెరుగుతుందంటూ టీడీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే పోలవరం టెండర్లను ఆహ్వానించబోతోంది. డ్యాం నిర్మాణంతో పాటు జల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని కలిపి టెండర్ పిలవబోతున్నారు. ఈ రెండు పనుల విలువను 5వేల 100 కోట్లగా అధికారులు తేల్చారు. డ్యాం నిర్మాణ పనుల విలువను 1900 కోట్లుగా, జల విద్యుత్ […]
పోలవరం రివర్స్ టెండరింగ్‌కు రంగం సిద్ధమైంది. రివర్స్ టెండరింగ్ వల్ల ఆలస్యం అవుతుంది… వ్యయం పెరుగుతుందంటూ టీడీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే పోలవరం టెండర్లను ఆహ్వానించబోతోంది.
డ్యాం నిర్మాణంతో పాటు జల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని కలిపి టెండర్ పిలవబోతున్నారు. ఈ రెండు పనుల విలువను 5వేల 100 కోట్లగా అధికారులు తేల్చారు. డ్యాం నిర్మాణ పనుల విలువను 1900 కోట్లుగా, జల విద్యుత్ కేంద్ర నిర్మాణం విలువను 3వేల 200 కోట్లుగా అంచనా వేశారు.
టెండర్ పక్రియకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత బిడ్ దాఖలకు 14 రోజులు సమయం ఇస్తారు. ఆ తర్వాత టెక్నికల్ బిడ్‌ను తెరుస్తారు. అయితే బిడ్‌లో తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్ట్ సంస్థ పేరును నేరుగా వెల్లడించరు. ప్రైస్ బిడ్‌ను తెరిచిన తర్వాత కోట్ అయిన తక్కువ ధరను వెల్లడిస్తారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పక్రియ మొదలవుతుంది. బిడ్‌కు అర్హత సాధించిన కంపెనీలన్నీ రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనవచ్చు. ప్రైస్ బిడ్‌లో కోట్ చేసిన దాని కంటే తక్కువ ధరకే పని చేసేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చు.
ఈ పక్రియ కోసం 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఎవరైనా ముందుకొచ్చి తక్కువ ధరకు కోట్ చేస్తే… మరో 15 నిమిషాలు కేటాయించి మరోసారి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. అలా వీలైనంత తక్కువ ధరకు కోట్ అయిన తర్వాత, ఇక ఎవరూ అంతకంటే తక్కువ ధరకు పనిచేసేందుకు ముందుకు రాని పక్షంలో అప్పుడు పనులు దక్కించుకున్న సంస్థ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. 14 రోజుల్లో కొత్త సంస్థతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. వీలైతే శుక్రవారం సాయంత్రమే టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. కాని పక్షంలో శనివారం టెండర్లు పిలిచే చాన్స్ ఉంది.